Fact Check : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీర్థాన్ని కింద పడినట్టుగా వైరల్ అవుతున్న వీడియో క్లిప్ చేసింది

ఈ మధ్యకాలం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు చేశారు.
Fact Check : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీర్థాన్ని కింద పడినట్టుగా వైరల్ అవుతున్న వీడియో క్లిప్ చేసింది
Published on
2 min read

ఈ మధ్యకాలం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు చేశారు. ఆ కల్తీ నెయ్యి లో జంతువుల కొవ్వు కలిసినట్టుగా గుజరాత్ కి చెందిన ఒక ల్యాబ్ రిపోర్టును కుడా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువచ్చారు. ఇది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది కాబట్టి ఆయనను ఈ విషయం లో నిందించటం, విమర్శించటం జరిగింది. 


ఈ నేపధ్యం లో ఒక 18 సెకెన్ల నిడివి గల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిని తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ షేర్ చేసి, మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వై స్ జగన్ మోహన్ రెడ్డి తీర్థం తీసుకోకుండా కింద పారబోశాడు అని షేర్ చేయడం జరిగింది.

ఆ పోస్టుకు శీర్షికగా, “తిరుమల లడ్డూ ప్రసాదం ఇస్తే, వాసన చూడటం వదిలేయటం. ఇంట్లో గుడి సెట్టింగ్ వేసుకోవటం, అక్కడ తీర్ధం ఇస్తే తాగినట్టు యాక్షన్ చేసి కింద పోయటం. ఏ నాడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వక పోవడం. గత 5 ఏళ్ళ వ్యక్తిగతంగా కూడా స్వామి వారిని అపవిత్రం చేసాడు జగన్ రెడ్డి,” అని పెట్టారు. ఇదే విధమైన క్లెయిమ్స్ తో మరిన్ని పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

Fact Check

కానీ మా పరిశోధన ప్రకారం, వైరల్ అవుతున్న వీడియో అసందర్భంగా ఎడిట్ చేసినది అని మేము కనుగొన్నాము.

వైరల్ వీడియో లో కీ ఫ్రేమ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు Sakshi news అనే ఛానల్ వీడియో ఒకటి లభించింది. ఇది జనవరి 14, 2024 నాడు లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది, ఇందులో మనకి సంక్రాంతి సందర్భంగా అప్పటి మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి భారతి తో పూజ లో పాల్గొనడం మనం చూడవచ్చు.

అయితే, వైరల్ అవుతున్న వీడియో, ఈ వీడియో నుండే తీసినట్టుగా నిర్ధారించవచ్చు, ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి మరియు భారతి ఈ రెండు వీడియోల లోను ఒకే రకమైన దుస్తులు ధరించారు, పైగా వెనకాల పసుపు పచ్చ ఫ్రేమ్ ను కుడా మనం గమనించ వచ్చు.

ఈ వీడియోను మొత్తం తీక్షణంగా చూస్తే, ఆ పూజ కార్యక్రమంలో భాగంగా పూజారి తీర్థ ప్రసాదం జగన్ మోహన్ రెడ్డి కి ఇవ్వగా, ఆయన తీసుకోవడం మనం 2:59 సెకెన్ల వద్ద చూడవచ్చు.  కానీ వైరల్ అవుతున్న వీడియోను దీని తరువాత నుండి తీసుకుని, కేవలం తీర్థం చేతిని తలపై నుండి నిమురుకోవడం మాత్రమే చూపించారు. 

వైరల్ అవుతున్న వీడియోను ఖండిస్తూ, వైఎస్సార్సీపీ కూడా తమ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. తమ పోస్ట్ లో , వైఎస్సార్సీపీ పార్టీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీర్థం తాగిన సన్నివేశం కూడా షేర్ చేసింది.

ఈ పోస్టుకు శీర్షికగా, “శ్రీవారి లడ్డుపై అసత్య ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయావు.. అయినా సిగ్గులేకుండా మళ్లీ ఫేక్ వీడియోతో మొదలెట్టావా? @ysjagan గారు సతీసమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను ఎంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారో నీ పచ్చ కళ్ల జోడు తీసి చూడు నీకు అనుకూలంగా వీడియోను ఎడిట్ చేసి ప్రజల చెవిలో మళ్లీ  పూలు పెడదామని అనుకుంటున్నావేమో. జనం ఉమ్మేస్తున్నా.. తుడుచుకుని మళ్లీ ఇలా ఫేక్ ప్రచారం చేస్తావ్.. ఎందుకంటే నీ బతుకే ఓ ఫేక్ కదా టీడీపీ. దీని ఆధారంగా, వైరల్ అవుతున్న వీడియో అవాస్తవం అని మనం నిర్ధారించవచ్చు.”

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in