భారతదేశంలో పరీక్షల కాపీయింగ్ మరియు ప్రశ్నపత్రం లీకేజీ అనేది నిరంతర సమస్యగా ఉంది, వివిధ ప్రాంతాలు మరియు విద్యాసంస్థల్లో వివిధ సందర్భాలు నివేదించబడ్డాయి. అయితే దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.
ఇటీవలి కాలంలో, ఉత్తరప్రదేశ్‌లోని ఒక కాలేజీలో జరిగిన పరీక్షలో చాలా మంది వ్యక్తులు కాపీయింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"ఉత్తర భారతదేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ [UPSC] నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ [CSE] సమయంలో కాపీయింగ్ జరుగుతోందని".
"ఇవి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న UPSE నిర్వహిస్తున్న IAS, IPS పరీక్షల భాగోతం..వీళ్ళు కలెక్టర్ అయి మన నెత్తిన కూర్చుంటే .మన దక్షిణ భారత్ దేశ ప్రజలు వీళ్ళను అనుసరించాలని" పలువురు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
UPSC పరీక్షకు సంబంధించిన మాస్ కాపీయింగ్ వీడియో అంటూ వచ్చిన వాదనలు తప్పు అని సౌత్ చెక్ గుర్తించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని సిటీ లా కాలేజీలో ఫిబ్రవరి 27న జరిగిన LLB [Law] పరీక్షలో మాస్ కాపీయింగ్ దృశ్యాలను ఆ వీడియో చూపిస్తుంది.
వీడియోలో, దానిని రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి పట్టణంలోని సిటీ లా కాలేజీ అని స్పష్టంగా పేర్కొన్నాడు.
సంబంధిత కీలక పదాలను ఉపయోగించి మేము ఆ కళాశాలకు సంబంధించిన ఇటీవలి వార్తల కోసం శోదించినపుడు, మాకు దానిపై అనేక వార్తా ప్రసారాలు మరియు వార్తా నివేదికలు కనిపించాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని సిటీ లా కాలేజీలో LLB పరీక్షలో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన చీటింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు బయటపడిందని నివేదికలు పేర్కొన్నాయి.
విద్యార్థులు పరీక్షలో కాపీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని. ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు బహిరంగంగా కాపీ చేయడం ఇందులో చిత్రీకరించబడిందని.
వీడియోలో, విద్యార్థులు గైడ్‌లు మరియు చీట్ షీట్‌లతో పరీక్ష సమయంలో వారి డెస్క్‌లపై సమాధానాలు రాసుకుంటున్నారని. వాగ్వాదం చోటుచేసుకుందన్న సమాచారంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని నివేదికలు పేర్కొన్నాయి.
ఈ ఘటనపై అధికారులు వేగంగా స్పందించడంతో పరీక్షలో కాపీ కొట్టిన 26 మంది విద్యార్థులు పట్టుబడ్డారు.
ఈ వీడియో వైరల్ కావడంతో రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కమిటీకి నాయకత్వం వహించి పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
సిటీ లా కాలేజీని వచ్చే ఆరేళ్లపాటు పరీక్షా కేంద్రం చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడే వారిపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఉద్ఘాటించారు.
ఇది ఆ వీడియోకు సంబంధించిన నిజం.అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్‌లో UPSC పరీక్షలో ఇటువంటి మాస్ కాపీయింగ్ సంఘటన జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు.
అందువల్ల, వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని సిటీ లా కాలేజీలో LLB పరీక్ష సమయంలో జరిగిన మాస్ కాపీయింగ్ అని మరియు UPSC పరీక్ష సమయంలో కాదని మేము నిర్ధారించాము.