Hyderabad: దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంకలో తీవ్రమైన వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో, ఏనుగు వరదలో చిక్కుకున్న కుక్కను కాపాడుతున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుతుంది.
ఒక ఫేస్‌బుక్ యూజర్ వీడియో ను షేర్ చేస్తూ, “ కుక్కను కాపాడిన ఏనుగు” అనే క్యాప్షన్ తో రాశాడు. (Archive)
సౌత్ చెక్ పరిశీలనలో ఈ వీడియో తప్పు అని తేలింది. ఇది అసలు వీడియో కాదు - AI సాయంతో సృష్టించబడిన కృత్రిమ వీడియో.
ముందుగా, కీవర్డ్ సెర్చ్ ద్వారా పరిశీలించగా, 2025లో శ్రీలంక వరదల సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.
ఈ వైరల్ వీడియోలోని కీఫ్రేమ్స్‌ను విడదీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా,అయితే, సెర్చ్ ఫలితాలలో ఇదే వీడియో టిక్‌టాక్‌లో ‘Contains AI-generated media’ లేదా అనే ట్యాగుతో ఉన్న పోస్టు మాకు కనిపించింది.
వీడియోలు ఉన్న ఈ పేజీలు అంతటా అనేక AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నట్టు స్పష్టమైంది.
తదుపరి ధృవీకరణ కోసం, హైవ్ అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్ ద్వారా ఈ వీడియోను పరిశీలించాము. హైవ్ విశ్లేషణలో ఈ వీడియో AIతో తయారు చేసిన వీడియో అని స్పష్టమైంది.
అందువల్ల, వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు నిజమైన రక్షణ వీడియో కాదు. ఇది AI-తో రూపొందించిన వీడియో మాత్రమే.
అందువల్ల, సౌత్ చెక్ ఈ క్లెయిమ్‌ను తప్పు అని నిర్ధారించింది.