Hyderabad: మహా కుంభ మేళాలో పాల్గొనడానికి హిమాలయ పర్వతాల నుండి వచ్చిన 154 ఏళ్ళ సన్యాసి అని క్లెయిమ్‌లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు ఎర్రటి వస్త్రం నుండి కొన్ని చిత్ర పటాలను తీసి, గోడకి ఆతికిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో మీద "154 ఏళ్ల సన్యాసి" అని హిందీలో వ్రాసి ఉంది.
ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన వ్యక్తి క్యాప్షన్‌లో ఈ విధంగా వ్రాశారు. "మహా కుంభమేళాలో పాల్గొనేందుకు హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన 154 ఏళ్ల సన్యాసి." (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టును ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొన్నాం. ఈ వీడియో పాతది.
ఈ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ఇదే వైరల్ వీడియో 11 అక్టోబర్ 2024లో ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయబడినట్లు గుర్తించాం. ఈ పోస్ట్ క్యాప్షన్‌లో, "హనుమంతుడికి చోళ నైవేద్యం సమర్పించిన సాధువు శ్రీ సియారాం బాబా" అని వ్రాశారు.
ఈ పోస్ట్ ద్వారా వైరల్ వీడియో 2025లో జరుగుతున్న మహా కుంభ మేళాలో తీసినది కాదని తెలుస్తోంది. మహా కుంభ మేళ 2025లో జనవరి 14న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రయాగరాజ్ లో ప్రారంభమైంది.
ఇదే వైరల్ వీడియోను 2024 డిసెంబర్ 11న షేర్ చేసిన X పోస్ట్ ఒకటి దొరికింది. ఈ పోస్ట్ కాప్షన్ ద్వారా వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సియారామ్ బాబా అని తెలుస్తుంది. "సియారామ్ బాబా ఈరోజు మోక్షద ఏకాదశి పర్వదినాన తన స్వర్గపు నివాసానికి బయలుదేరాడు. ఓం శాంతి. భగవాన్ శ్రీరాముడి పట్ల ఆయనకున్న భక్తి ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంటుంది. జై జై శ్రీ రామ్." (ఆర్కైవ్)
ఇదే విషయాన్నీ ధ్రువీకరిస్తూ Economic Times 2024 డిసెంబర్ 11న ప్రచురించి కథనంలో ఈ విధంగా వ్రాశారు, "హనుమంతుడు, నర్మదా నది పట్ల తన భక్తికి పేరుగాంచిన గౌరవనీయమైన ఆధ్యాత్మిక వ్యక్తి సియారామ్ బాబా బుధవారం 95 సంవత్సరాల వయసులో మరణించారు. మోక్షద ఏకాదశి, గీతా జయంతి శుభదినమైన నాడు ఆయన మరణించారు."
సియారామ్ బాబా మరణించే నాటికి ఆయన వయసు 95 సంవత్సరాలు అని పలు వార్త కథనాలు పేర్కొన్నాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఇటీవల మహా కుంభ మేళాలో తీసినది కాదని, వీడియోలో కనిపిస్తున్న సియారామ్ బాబా మహా కుంభ మేళా ప్రారంభానికి ముందే మరణించారని, అప్పటికి ఆయన వయసు 95 ఏళ్ళని తేలింది. వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించాం.