Telugu

Fact Check : విద్యుత్ శాఖ ఉద్యోగిపై వైసీపీ అనుచరుల దాడి అంటూ వచ్చిన వీడియో ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాదు

ఈ ఘటన హైదరాబాద్‌ మోతీనగర్‌ పరిధిలో జరిగింది అని సౌత్ చెక్ కనుగొంది.

ravi chandra badugu

ఓ యువకుడు విద్యుత్ సిబ్బంది పై విచక్షణారహితంగా దాడి చేసినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆంధ్ర ప్రదేశ్, కోడుమూరు గ్రామంలో పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లు చెల్లించాలని ఆ గ్రామ వైసీపీ నాయకుడిని అడిగినందుకు విద్యుత్ శాఖ ఉద్యోగిపై వైసీపీ అనుచరుల బృందం దాడి చేసింది అనే వాదనతో సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో తెలంగాణలో జరిగింది అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, 2024 జూలై 19న సమయం తెలుగు (The Times of India) ఆన్‌లైన్ వార్తా ద్వారా వామ్మో.. కరెంట్ బిల్లు కట్టమన్నందుకు ఇంత ఘోరమా.. ఇలా అయితే కష్టమే..! అనే టైటిల్ తో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో హైదరాబాద్‌ మోతీనగర్‌ పరిధిలో వెంకటస్వామి అనే వ్యక్తి పేరు మీద దాదాపు 6 వేల 800 రూపాయల కరెంట్ బిల్లులు పెండింగ్ ఉంది. లైన్ ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్‌, మరో ఉద్యోగితో కలిసి వినియోగదారుడు వెంకటస్వామి ఇంటికెళ్లి పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు. బిల్లు కట్టమంటూ వెంకటస్వామి కుటుంబ సభ్యులు మొండిగా వాదించడంతో బిల్లు కట్టని కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని లైన్ ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్‌ చెప్పటంతో కోపంతో ఉన్న వెంకటస్వామి కుమారుడు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌పై దాడికి తెగబడ్డాడు అని మరింత వివరాలతో ఆ నివేదిక పేర్కొంది.

అంతేకాకుండా, 2024 జూలై 19న THE FEDERAL ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా మరో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో హైదరాబాద్ సనత్ నగర్ లో పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు అంటూ ఒక కథనాన్ని మేము కనుకున్నాము.

అదనంగా, మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత సాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, హైదరాబాద్ సనత్‌నగర్‌లో జూలై 18 2024న పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఒక లైన్ ఇన్‌స్పెక్టర్ మీటర్ రీడింగ్‌లను తనిఖీ చేయడానికి కబీర్ నగర్, మోతీనగర్‌కు వెళ్లారు. ఒక ఇంట్లో మీటర్ రీడింగ్‌లను పరిశీలిస్తున్నప్పుడు, గత కొన్ని నెలలుగా రూ.6,000కు పైగా పేరుకుపోయిన పెండింగ్ విద్యుత్ బిల్లులను చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని చెప్పటంతో ఆ ఇంటి యువకుడు విద్యుత్ శాఖ ఉద్యోగి తో వాగ్వాదానికి దిగి, దాడికి తెగబడ్డారు అని మా పరిశోధనలో కనుగొన్నాము.

అందువల్ల, నిజానికి ఈ వైరల్ వీడియో తెలంగాణకు సంబంధించినది, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేము నిర్ధారించాము.

Fact Check: Muslim driver rams into Ganesh procession on purpose? No, claim is false

Fact Check: നേപ്പാള്‍ പ്രക്ഷോഭത്തിനിടെ പ്രധാനമന്ത്രിയ്ക്ക് ക്രൂരമര്‍‍ദനം? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: இறைச்சிக்கடையில் தாயை கண்டு உருகும் கன்றுக்குட்டி? வைரல் காணொலியின் உண்மையை அறிக

Fact Check: ನೇಪಾಳಕ್ಕೆ ಮೋದಿ ಬರಬೇಕೆಂದು ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯುತ್ತಿದೆಯೇ? ಇಲ್ಲ, ಸತ್ಯ ಇಲ್ಲಿದೆ

Fact Check: రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను వ్యతిరేకిస్తున్న మహిళ? లేదు, ఇది పాత వీడియో