Telugu

Fact Check : ప్రజావేదికను రూ.900 కోట్లు పెట్టి నిర్మించారు అంటూ వచ్చిన వార్తల్లో నిజమెంత?

వాస్తవానికి వైరల్ అయిన వైసీపీ ప్రతినిధి వ్యాఖ్యలు అవాస్తవం అని సౌత్ చెక్ కనుగొంది.

ravi chandra badugu

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన ప్రజా వేదిక కూల్చివేత వ్యవహారం అప్పట్లో ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అప్పటి వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా కూల్చిందంటూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది కానీ తక్షణ ఉపశమనం మాత్రం లభించలేదు అయితే ఈ ఐదేళ్ల పాటు దాని తాలూకు శిథిలాలను కూడా తొలగించకుండా అలాగే ఉంచారు.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన తర్వాత 13 జూన్ 2024 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నంలో రూ.500 కోట్లతో విలాసవంతమైన హిల్‌టాప్ రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించారు అని మరియు 12 లక్షల కోట్ల అప్పులతో కూడిన ఆంధ్రప్రదేశ్ యొక్క భయంకరమైన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రజా నిధుల దుర్వినియోగం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు

ఈ నేపథ్యంలో, సాక్షి మీడియా చర్చా వేదికలో వైసీపీ ప్రతినిధి కె ఎస్ ప్రసాద్ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావేదికను రూ.900 కోట్లు పెట్టి నిర్మించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఉన్న ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ప్రజా వేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం రూ.90 లక్షలు అని సౌత్ చెక్ కనుగొంది

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో జూన్ 19, 2024న FactCheck.AP.Gov.in ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ప్రజా వేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం రూ.90 లక్షలు. 2017వ సంవత్సరం ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో ప్రకారం ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ నుంచి, ప్రజా వేదిక నిర్మాణానికి, రూ.90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ప్రజా వేదిక వద్ద పోలీస్ సెక్యూరిటీ అవుట్ పోస్టులు.. పార్కింగ్ స్థలం ఏర్పాటు.. వంటి వాటికి కలిపి.. కోటీ తొంబై లక్షలు ఖర్చు అయ్యాయి. ప్రజా వేదిక నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు అనేది పూర్తిగా అవాస్తవం అని వ్యక్తం చేశారు

మా పరిశోధనలో భాగంగా మేము కొన్ని వార్త నివేదికలను పరిశీలించగా, వేరువేరు నివేదికలు వేరువేరు ఫిగర్లు పేరుకున్నాయి, కొన్ని నివేదికలు ప్రజావేదిక తో పాటు దాని కోసం నిర్మించిన సెక్యూరిటీ పోస్ట్, పార్కింగ్ స్థలం మరియు ఫెన్సింగ్ సదుపాయంతో కలిపి అయిన ఖర్చు 8.91 కోట్లు మాత్రమే అని ప్రచురించబడింది మరియు ప్రజా వేదికకు 900 కోట్లు ఖర్చయింది అని వేరే ఏ నివేదికలో ప్రచురించబడలేదు అని మేము నిర్ధారించాము.

అంతేకాకుండా, ఈ జీవోలో ప్రజావేదిక భవనానికి రూ.90 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు ఉంది. 2017 ఏప్రిల్ 4న అప్పటి ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసినట్లు ఉంది అయితే ఈ జీవో కాపీని సోషల్ మీడియా వినియోగదారులు తెగ వైరల్ చేస్తున్నారు. వైసీపీ సాక్షి మీడియాలో ప్రజా వేదిక పై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ విమర్శిస్తున్నారు.

అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మోహన్ రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించడానికి ₹ 500 కోట్లు ఖర్చు చేశారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో 2015-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వేదిక కోసం పెట్టిన ఖర్చుతో పోలిస్తే రుషికొండ నిర్మాణం కోసం తక్కువ ఖర్చు పెట్టామంటూ వైసీపీ సాక్షి మీడియా చర్చాలో కౌంటర్ ఇవ్వగా ఏపీ ప్రభుత్వం స్పందించి ప్రజా వేదిక నిర్మాణానికి రూ.90 లక్షలే ఖర్చయిందని క్లారిటీ ఇచ్చింది

అందువల్ల, ప్రజా వేదిక నిర్మాణానికి రూ.900 కోట్ల ఖర్చు అయిందంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Fact Check: Jio recharge for a year at just Rs 399? No, viral website is a fraud

Fact Check: മുക്കം ഉമര്‍ ഫൈസിയെ ഓര്‍ഫനേജ് കമ്മിറ്റിയില്‍നിന്ന് പുറത്താക്കിയോ? സത്യമറിയാം

Fact Check: தந்தையும் மகனும் ஒரே பெண்ணை திருமணம் செய்து கொண்டனரா?

ఫాక్ట్ చెక్: కేటీఆర్ ఫోటో మార్ఫింగ్ చేసినందుకు కాదు.. భువ‌న‌గిరి ఎంపీ కిర‌ణ్ కుమార్ రెడ్డిని పోలీసులు కొట్టింది.. అస‌లు నిజం ఇది

Fact Check: ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರ ಗುಂಪೊಂದು ಕಲ್ಲೂ ತೂರಾಟ ನಡೆಸಿ ಬಸ್ ಧ್ವಂಸಗೊಳಿಸಿದ್ದು ನಿಜವೇ?