Telugu

Fact Check: కేసీఆర్ హయాంలో నిర్మించిన వంతెన కూలిపోవడానికి సిద్ధం? లేదు, ఇది బీహార్‌లో ఉంది

చేతితో తవ్వగానే పిండి పిండిగా మారుతున్న వంతెన స్తంభాలను చూపిస్తున్న వీడియో తెలంగాణలో కేసీఆర్ పాలన సమయంలో నిర్మించిందని క్లెయిమ్‌లతో వైరల్ అవుతోంది.

Sherly

Hyderabad: ఒక వ్యక్తి వంతెన కింద స్తంభాన్ని కేవలం తన చేతితో తవ్వితే పిండి పిండిగా రాలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో తెలంగాణకు చెందినదిగా, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హయాంలో కట్టినదిగా క్లెయిమ్ చేస్తున్నారు. 

ఈ వీడియో పై "ఇది మన కేసీఆర్ కాక 10 సంవత్సరాలు యోజన అభివృద్ధి" అని రాసి ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాశారు, "మళ్లీ కేసీఆర్ పాలన వస్తే ఇదే గతి పడుతుంది 10 ఏళ్ల పాలన లో ఉన్న పాలన ఇప్పుడు ఇదే సమాధానం". (ఆర్కైవ్

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)

Fact Check 

సౌత్ చెక్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. వీడియోలో ఉన్న బ్రిడ్జ్ బీహార్లో ఉంది, ఇది తెలంగాణకు చెందినది కాదు. 

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆగష్టు 7న Xలో పోస్ట్ చేసిన అదే వీడియో దొరికింది. ఈ పోస్టులో "బీహార్ నేల చాలా బలంగా ఉంది, కాంట్రాక్టర్లు వంతెనలు నిర్మించడానికి సిమెంటుకు బదులుగా మట్టిని ఉపయోగిస్తారు. NHAI, PWD కూడా ఈ మట్టిని ఉపయోగించాలని నేను చెబుతాను."

వీడియోని క్యాప్షన్‌ని పోల్చి చూడగా బీహార్ కాంట్రాక్టర్లు మట్టిని ఉపయోగించి ఈ వంతెనను కట్టినట్టు వెటకారంగా రాసారు అని తెలుస్తోంది. 

బీహార్లో ఉన్న వంతెనలకు సంబంధించి కీ వర్డ్ సెర్చ్ చేయగా 'Indian Nix' అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియో ఒకటి దొరికింది.

వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి కూడా ఇదే పేరుతో ఉన్న మైక్ పట్టుకొని వీడియో చేస్తున్నట్లు గమనించవచ్చు.

ఈ వీడియోని జనవరి 24న, "బీహార్‌లోని కుమార్‌సర్‌ బోల్బమ్ రోడ్డుపై రూ.12 కోట్ల విలువైన వంతెన కూలిపోయింది. కేవలం మట్టి, బ్యాలస్ట్ #పుల్‌తో చేసిన వంతెనలు", అనే శీర్షికతో అప్లోడ్ చేశారు. యూట్యూబ్ వీడియో, వైరల్ వీడియోలలో ఉన్న వంతెన మధ్య పోలికలు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ వీడియోను అదే రోజు ఈ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినట్లు కనుగొన్నాం. టైటిల్‌లో వారు 'బీహార్ వంతెన' అని హిందీలో రాశారు.

యూట్యూబ్ వీడియో టైటిల్‌లోని లీడ్‌ను ఉపయోగించి, వంతెన ఉన్న ప్రదేశాన్ని వెతికాము. బీహార్‌లోని బంకా, ముంగేర్ జిల్లాల మధ్య బదువా నదిపై వంతెన ఉందని గూగుల్ మ్యాప్స్‌లో కనుగొన్నాం.

సెప్టెంబర్ 29, 2020న ఆజ్‌తక్ ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ వంతెనను 2010లో 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దైనిక్ భాస్కర్ 2022లో ఒక నివేదికను కూడా ప్రచురించింది, వంతెన కేవలం 10 సంవత్సరాలలోనే కూలిపోయిందని పేర్కొంది.

బీహార్‌లోని కుమార్‌సర్‌ సమీపంలోని బదువా నదిపై నిర్మించిన వంతెన స్థితిని వైరల్ వీడియో చూపిస్తుందని తేలింది.

కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని సౌత్ చెక్ నిర్ధారించింది.

Fact Check: Kerala dam video goes viral? No, video shows Adavinainar Dam in Tamil Nadu

Fact Check: രക്ഷാബന്ധന്‍ സമ്മാനമായി സൗജന്യ റീച്ചാര്‍ജ്? പ്രചരിക്കുന്ന വാട്സാപ്പ് സന്ദേശത്തിന്റെ വാസ്തവം

Fact Check: துப்புரவு பணியாளர்கள் கைதின்போது கொண்டாட்டத்தில் ஈடுபட்டாரா திருமாவளவன்? உண்மை என்ன

Fact Check: ರಾಮ ಮತ್ತು ಹನುಮಂತನ ವಿಗ್ರಹಕ್ಕೆ ಹಾನಿ ಮಾಡುತ್ತಿರುವವರು ಮುಸ್ಲಿಮರಲ್ಲ, ಇಲ್ಲಿದೆ ಸತ್ಯ

Fact Check: வைரலாகும் மேக வெடிப்பு காட்சி? வானிலிருந்து கொட்டிய பெருமழை உண்மை தானா