Telugu

ఫ్యాక్ట్ చెక్: హేమంత్ సొరెన్ ప్రమాణ స్వీకార వేడుకలో రాహుల్ గాంధీని కేజ్రీవాల్ నిర్లక్ష్యం చేశారా? కాదు, వైరల్ వీడియో కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార వేడుకలో కేజ్రీవాల్, రాహుల్ గాంధీతో చేతులు కలపకుండా పక్కన పెడుతున్నట్లు చూపిస్తున్నా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Ramesh M

హైదరాబాదు: జార్ఖండ్ ముఖ్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్, నవంబర్ 28న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాంచీ మోరాబడీ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో ప్రముఖ  ఇండియా బ్లాక్ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్య‌ అతిథులుగా, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికర్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజశ్వి యాదవ్ హాజ‌ర‌య్యారు.

ప్రమాణ స్వీకార వేడుకలో కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చేతులు కలిపి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కేజ్రీవాల్, రాహుల్ గాంధీతో చేతులు కలిపి మాట్లాడటం లేదు అని ప్రచారం జరుగుతోంది.

Xలో ఒక వినియోగదారు ఈ వీడియోను షేర్ చేస్తూ, "కేజ్రీవాల్ రాహుల్ గాంధీతో చేతులు కలిపి మాట్లాడలేదు... ఇది స్పష్టంగా చూపిస్తోంది ఆప్ ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోడం లేదని" అని రాశారు.

ఫ్యాక్ట్ చెక్:

న్యూస్ మీటర్ ఈ క్లెయిమ్ అబద్ధం అని కనుకోంది. కేజ్రీవాల్ మొదట రాహుల్ గాంధీతో చేతులు కలిపి ఆ తరువాత శివకుమార్‌కి షేక్ హాండ్ ఇస్తున్న వీడియోను కుదించి కొంతమంది తప్పుగా ప్రచారం చేశారు.

మేము Xలో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఒక యూజర్ షేర్ చేసిన రెండు వీడియో క్లిప్స్ దొరికాయి. మొదటి క్లిప్‌లో కేజ్రీవాల్ రాహుల్ గాంధీతో చేతులు కలపడం కనిపించలేదు. కానీ రెండో క్లిప్‌లో మాత్రం వారు ముందుగా చేతులు కలుపుకున్న తర్వాత శివకుమార్‌తో చేతులు కలపడం స్పష్టంగా చూడవచ్చు.(Archive)

ఈ ఆధారాన్ని అనుసరించి, మేము నవంబర్ 28న జరిగిన ప్రమాణ స్వీకార వేడుక వీడియో కోసం యూట్యూబ్‌లో శోధించామం. జార్ఖండ్ ప్రభుత్వ చానల్‌లో 3 గంటలకు పైగా ఉన్న లైవ్ స్ట్రీమ్ వీడియో అందుబాటులో ఉండటం కనుగొన్నామం.

2:53:00 గంటల టైమ్‌స్టాంప్ వద్ద, కేజ్రీవాల్ తన భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత రాఘవ్ చద్ధాతో కలిసి ఈ వేడుకకు చేరుకుంటారు. వారిని సొరెన్ భార్య కల్పనా సొరెన్ స్వాగతిస్తారు. 2:56:00 టైమ్‌స్టాంప్‌లో, కేజ్రీవాల్ స్టేజ్‌పైకి వెళ్లి 2:56:06లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతారు. ఆ తర్వాత డీకే శివకుమార్‌తో కూడా శుభాకాంక్షలు పంచుకుంటారు. అనంతరం మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీల‌కు నమస్కారం తెలుపుతారు.

మేము నవంబర్ 28న లైవ్ హిందుస్థాన్ ప్రచురించిన ప్రమాణ స్వీకార వేడుక వీడియోను కూడా పరిశీలించాము. ఈ వీడియోలో, 49:28 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద కేజ్రీవాల్ రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

అందువల్ల, వైరల్ వీడియోను కట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా తయారు చేశారని మేము నిర్ధారించాము. సొరెన్ ప్రమాణ స్వీకార వేడుకలో కేజ్రీవాల్ రాహుల్‌ను పట్టించుకోలేదన్న వాదన తప్పు అని తేలింది.

Fact Check: Potholes on Kerala road caught on camera? No, viral image is old

Fact Check: ഇത് റഷ്യയിലുണ്ടായ സുനാമി ദൃശ്യങ്ങളോ? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: ஏவுகணை ஏவக்கூடிய ட்ரோன் தயாரித்துள்ள இந்தியா? வைரல் காணொலியின் உண்மை பின்னணி

Fact Check: ರಷ್ಯಾದ ಕಮ್ಚಟ್ಕಾದಲ್ಲಿ ಭೂಕಂಪ, ಸುನಾಮಿ ಎಚ್ಚರಿಕೆ ಎಂದು ಹಳೆಯ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: హైదరాబాద్‌లో ఇంట్లోకి చొరబడి పూజారిపై దాడి? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి