Telugu

Fact Check: మాల్దాలో హింసాకాండ, అగ్ని ప్రమాదాన్ని చూపిస్తున్న వీడియో? లేదు, ఇది బంగ్లాదేశ్‌లో జరిగింది

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో హింసాకాండను చూపుతుంది అని క్లెయిమ్స్ తో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అగ్ని ప్రమాదం జరిగినట్లు కనిపిస్తుంది.

Sherly

Hyderabad: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో మార్చి 27న మత ఉద్రిక్తతలు చెలరేగాయి. ఒక మూక అక్కడి దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేసింది. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈ పరిస్థితిని 'పూర్తిగా చట్టం విఫలమైన స్థితి' అని అన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పారామిలిటరీ దళాలను ఉపయోగించాలని గవర్నర్ సివి ఆనంద బోస్‌ను కోరారు.

కొంత మంది కలిసి వాహనాలకు నిప్పంటించడం చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితులు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన హింసకు సంబంధించినవి అనే క్లెయిమ్‌లతో షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోను Xలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో "మమత UKలో ఉన్నందున, పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలోని మోతబారి జిల్లాలో హిందూ దుకాణాలపై దాడి చేసి, ఆస్తులను తగలబెట్టిన రాడికల్ గుంపును చూపించే భయంకరమైన వీడియో SMలో వైరల్ అయింది" అని రాశారు.

మరొక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను మతపరంగా, వ్యంగ్యంగా చిత్రీకరించిన శీర్షికతో షేర్ చేశారు: "'సౌగత్-ఎ-మోదీ' (మోదీ బహుమతి) తర్వాత, ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో 'సౌగత్-ఎ-ముస్లిం' (ముస్లిం రిటర్న్ గిఫ్ట్) వచ్చింది. మోడీ బహుమతితో సంతోషించిన ఒక నిర్దిష్ట శాంతియుత సమాజం మాల్డాలోని హిందువులకు బలమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని చెబుతారు. సౌగత్-ఎ-మోదీ వేడుకలో, మాల్డాలోని ముస్లింలు ద్వేషాన్ని మరచిపోయి హిందూ ప్రాంతాలలో దీపావళి జరుపుకోవడం ద్వారా ఆనందిస్తారు. అభినందనలు, మోడీ జీ." (ఆర్కైవ్)

Fact Check

సౌత్ చెక్ ఈ వాదన తప్పు అని కనుగొంది. ఇది బంగ్లాదేశ్లో జరిగిన ఘటనకు సంభందించిన వీడియో.

ఈ వీడియో కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, నవంబర్ 27, 2023న బంగ్లాదేశ్‌కు చెందిన మీడియా సంస్థ Prothom Alo ప్రచురించిన వీడియో దొరికింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో దిగ్బంధనకు మద్దతుగా టార్చ్ ర్యాలీ, వాహనాలను ధ్వంసం చేసిన దృశ్యాలను ఫుటేజీలో చూపించినట్లు బెంగాలీలో ఉన్న క్యాప్షన్ సూచించింది.

ఈ లీడ్‌ను అనుసరించి, కీవర్డ్ సెర్చ్ ద్వారా నవంబర్ 27, 2023 నాటి Daily Sylhet Mirror కథనాన్ని కనుగొన్నాం, ఇందులో వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్ ఉపయోగించారు.

ఈ కథనం ప్రకారం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), అనుబంధ సమూహాలు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన సమయంలో సిల్హెట్‌లోని సుబిద్‌బజార్ ప్రాంతంలో జరిగిన టార్చ్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు వాహనాలను ధ్వంసం చేసి, రిక్షాలు, ఆటో-రిక్షాలు, అంబులెన్స్‌కు నిప్పంటించారు, ఇది స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

Dhaka Tribune నవంబర్ 26, 2023 నాటి కథనం ప్రకారం, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని అనుబంధ సంఘాలు పాలక అవామీ లీగ్ ప్రభుత్వం రాజీనామా చేయాలని, తదుపరి సార్వత్రిక ఎన్నికలను నిష్పక్షపాత పరిపాలనలో నిర్వహించాలని ఒత్తిడి చేయడానికి ఆరు దశల్లో బంద్‌లను నిర్వహించాయి. ఈ బంద్‌ సమయంలో వాహనాలకు నిప్పంటించడం, హింస జరిగాయని, అయితే ఈ నిరసనలో ప్రజల పాత్ర తక్కువగా ఉందని కథనం పేర్కొంది.

మార్చి 28, 2025న పశ్చిమ బెంగాల్ పోలీసుల అధికారిక X హ్యాండిల్ నుండి చేసిన పోస్టు కనుగొన్నాం. వైరల్ వీడియో నవంబర్ 2023లో బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో జరిగిన సంఘటనలను చూపిస్తుందని, మాల్డాలో జరిగిన సంఘటనతో దీనికి ఎటువంటి సంబంధం లేదని పోస్ట్ పేర్కొన్నారు. మాల్డాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కూడా పేర్కొన్నారు.

కాబట్టి, ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో హింసాకాండను చూపించడం లేదని సౌత్ చెక్ నిర్ధారించింది. వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు.

Fact Check: Elephant hurls guard who obstructed ritual in Tamil Nadu? No, here’s what happened

Fact Check: ശബരിമല മകരവിളക്ക് തെളിയിക്കുന്ന പഴയകാല ചിത്രമോ ഇത്? സത്യമറിയാം

Fact Check: இந்துக் கடவுளுக்கு தீபாராதனை காட்டினாரா அசாதுதீன் ஓவைசி? உண்மை அறிக

Fact Check: ಮೋದಿ ಸೋಲಿಗೆ ಅಸ್ಸಾಂನಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಬಾಂಗ್ಲಾದೇಶದ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: శ్రీలంక వరదల్లో ఏనుగు కుక్కని కాపాడుతున్న నిజమైన దృశ్యాలా? కాదు, ఇది AI-జనరేటెడ్ వీడియో