ఓ వ్యక్తి పోలీసు అధికారి చొక్కా కాలర్ పట్టుకుని దాడి చేసినట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ నగరం ఎస్‌ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేసాడు, అధికారుల పై రోజురోజుకి పెరుగుతున్న దౌర్జన్యాలు, అధికార TDP పార్టీ కార్యకర్తలు కావడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో అధికారులు అనే వాదనతో సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు అది పుకారు అని సౌత్ చెక్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 ఆగస్టు 04న, FactCheck.AP.Gov.in ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూనుగుంట సాయిబాబా, వైఎస్సార్‌సీపీ వేమూరు ఏసీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాయిబాబా పై అవినీతి ఆరోపణలకు సమాధానంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి 03-08-2024న బట్టిప్రోలు సెంటర్‌లో సవాలును ప్రకటించారు అయితే భద్రతా కారణాల రీత్యా సమావేశానికి రేపల్లె ఎస్‌డిపిఒ అనుమతి నిరాకరించడంతో పాటు 30 పోలీసు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అనంతరం స్థానిక పోలీసులు సాయిబాబా, అశోక్‌బాబు, వేమూరు ఎమ్మెల్యే శ్రీ నక్కా ఆనందబాబులను అరెస్టు చేశారు.ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి పై దాడిని సూచిస్తూ తప్పుదారి పట్టించే ఫోటో బయటపడింది. అధికార పార్టీ కార్యకర్త సబ్-ఇన్‌స్పెక్టర్ కాలర్‌ను పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఫోటో, ఎలాంటి దాడి జరగలేదని చూపించే వీడియో సాక్ష్యాలతో కొట్టిపారేశారు. ఫేక్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతిపక్షాలు ఈ ఫోటోను సర్క్యులేట్ చేశాయి అని పేర్కొంది.
అంతేకాకుండా, X లో 2024 ఆగస్టు 04న, Lokesh Nara ఖాతా ద్వారా టిడిపి కార్యకర్త SI కాలర్ పట్టుకున్నారంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు, పోలీసుల పై ఎటువంటి దాడి జరగలేదు, శాంతిభద్రతలు కాపాడుతున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే చర్యలు తప్పవు అంటూ ఒరిజినల్ వీడియోను పోస్ట్ చేయబడింది.
అదనంగా, 2024 ఆగస్టు 04న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు X ఖాతా ద్వారా ఫేక్ న్యూస్ నమ్మొద్దు....ఫేక్ గాళ్లను నమ్మొద్దు....ఫేక్ రాజకీయాల ట్రాప్ లో పడి మోసపోవద్దు అంటూ వైరల్ స్క్రీన్‌షాట్‌కు సంబంధించిన ఒరిజినల్ వీడియోను పోస్ట్ చేయబడింది.
అందువల్ల, అధికార TDP పార్టీ కార్యకర్త, పోలీసు అధికారి చొక్కా పట్టుకుని నెట్టివేసాడు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.