Fact Check: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ప్రజలను ఓ వ్యక్తి బస్సు పైన స్పీకర్ లో నుండి, వెళ్లిపోకండి అని వేడుకుంటున్నట్టు వచ్చిన వీడియో ఎడిట్ చేయబడింది

నిజానికి సీఎం జగన్ బస్సు యాత్రలో అలాంటిదేమీ జరగలేదు
Fact Check: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ప్రజలను ఓ వ్యక్తి బస్సు పైన స్పీకర్ లో నుండి, వెళ్లిపోకండి అని వేడుకుంటున్నట్టు వచ్చిన వీడియో ఎడిట్ చేయబడింది

మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒకేసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 27న, 21 రోజుల బస్సు యాత్రకు బయలుదేరారు.

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 22 జిల్లాలను జగన్ కవర్ చేయనున్నారు, ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం లో ముగుస్తుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 171 నియోజకవర్గాల గుండా సీఎం నేతృత్వంలో యాత్ర సాగనుంది.

పెంచికలపాడు వద్ద సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీఎం జగన్ తన బస్సు యాత్రలో వెళ్తున్న బస్సు పై భాగంలో ఏర్పాటు చేసిన స్పీకర్లలో ఓ వ్యక్తి మాట్లాడుతూ. " మహిళలు అందరు వెళ్లిపోతున్నారు, పెద్దాయన మాట్లాడుతున్నారు, అమ్మ అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి.. ఆగండి.. చెప్పినందుకైనా ఆగండి , వెనక్కి రండి, అని వేడుకోవడం మనకు ఈ వీడియోలో వినిపిస్తుంది.

ఇదే వీడియో ని షేర్ చేస్తూ ఒక X వినియోగదారు, " మంచి స్ట్రాటజీ ..IPAC ఇలా చేస్తే ఐన జనాలు వస్తారేమో..బస్సు మీద స్పీకర్స్ పెట్టి మరి జనాన్ని రమ్మని అడుగుతున్నారు" అంటూ పోస్ట్ చేశారు.

నిజ నిర్ధారణ:

వీడియో ఎడిట్ చేయబడిందని తప్పుదారి పట్టించేలా ఉందని సౌత్ చెక్‌ కనుగొంది.

మేము వైరల్ వీడియో నుండి సంబంధిత కీలక పదాలను ఉపయోగించి శోధించినప్పుడు, వైరల్ వీడియోలో ఏదైతే వ్యక్తి ప్రజలను వెళ్ళిపో వద్దు అంటూ వేడుకున్నా వాయిస్ కు సంబందించిన ఒరిజినల్ వీడియో యూట్యూబ్ లో కనుగొనబడింది.

నిజానికి ఈ ఘటన నెల్లూరు లో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి ప్రచారం సందర్భంగా జరిగింది. విజయ సాయి రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించగా, కొంతమంది మహిళలు సభ నుండి వెళ్లిపోవడం గమనించబడింది. తదనంతరం, ఒక నాయకుడు వారిని వెళ్లవద్దని అభ్యర్థిస్తూ "మహిళలు అందరు వెళ్లిపోతున్నారు, పెద్దాయన మాట్లాడుతున్నారు, అమ్మ అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి.. ఆగండి.. చెప్పినందుకైనా ఆగండి , వెనక్కి రండి" అంటూ మైక్ లో మాట్లాడారు.

అయితే నెల్లూరు లో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి ప్రచారం సందర్భంగా జరిగిన సంఘటన నుంచి వాయిస్ ఎక్స్ట్రాక్ట్ చేసి, పెంచికలపాడు వద్ద సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌కు డిజిటల్‌గా జోడించబడింది.

అందుకే, సీఎం జగన్ బస్సు యాత్ర కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేయబడిందని మేము నిర్ధారించాము

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in