Fact Check: అమిత్ షా కాళ్లు మొక్కిన చంద్రబాబు అని ఓ ఫోటోతో వస్తున్న వార్త నిజం కాదు, అది ఎడిట్ చేయబడింది

పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. బుధవారం రాత్రి అమిత్ షా నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
Fact Check: అమిత్ షా కాళ్లు మొక్కిన చంద్రబాబు అని ఓ ఫోటోతో వస్తున్న వార్త నిజం కాదు, అది ఎడిట్ చేయబడింది

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం అర్థరాత్రి న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. త్వరలో ఒకేసారి జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం త్రైపాక్షిక పొత్తుపై వారు చర్చించారు.

దీనికి సంబంధించి Way2News మీడియా సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు అమిత్ షా పాదాలను తాకుతున్నారంటూ, బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 22 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, ఓ ఫోటోతో కూడిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాల మంది X మరియు ఇతర సోషల్ మీడియా వినియోగదారులు "అమిత్ షా కాళ్లు మొక్కిన చంద్రబాబు!" అని ఇదే కథనాన్ని పోస్ట్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

సౌత్ చెక్ ఈ కథనం నిజం కాదని, ఎడిట్ చేయబడిందని కనుగొంది.

మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. Way2News సంస్థకు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ X (ట్విట్టర్) హ్యాండిల్ లో వైరల్ అవుతున్న కథనాన్ని తమ సంస్థ ప్రచురించలేదని పేర్కొంటూ ఒక పోస్ట్ని పెట్టారు.

కొంతమంది మా లోగోను ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

మేము కథనంలోని ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు. వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు, అమిత్ షాల ఒరిజినల్ ఫోటోలు దొరికాయి.

మనం ఇప్పుడు ఈ ఫోటోను పరిశీలిస్తే, కథనంలోని ఫోటో ఎడిట్ చేయబడిందని మరియు నకిలీదని తేలికగా నిర్ధారించవచ్చు.

కథనంలో వ్రాసినట్లుగా, బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 22 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, మేము దీనిపై ఎటువంటి వార్తా నివేదికను కనుగొనలేదు. ఈ విషయాన్ని తెలిపే వార్తలేవీ రాలేదు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి తప్పుడు వార్తలు ఎన్నో చూస్తున్నాం.

అందుకే, Way2News పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటో ఫేక్ అని తేల్చాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in