Fact Check: పోలీసుల తనిఖీల్లో నారా లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు పట్టుబడినట్లు వచ్చిన వీడియో ఎడిట్‌ చేయబడింది

ఎన్నికల కోడ్ దృష్ట్యా పోలీసులు నారా లోకేష్ కాన్వాయ్‌ని పలుమార్లు తనిఖీ చేశారు. కానీ డబ్బు పట్టుబడలేదు.
Fact Check: పోలీసుల తనిఖీల్లో నారా లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు పట్టుబడినట్లు వచ్చిన వీడియో ఎడిట్‌ చేయబడింది
Published on
2 min read

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు, నిఘా బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తన కాన్వాయ్‌ను ఒకేరోజు పలుమార్లు పోలీసులు తనిఖీ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టలతో నారా లోకేష్ పట్టుబడ్డాడన్న దావాతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ యువనేత నారా లోకేశ్‌ కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేయగా సుమారు ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబడింది అని వీడియోలో మనం వినవచ్చు.

వీడియో యొక్క స్క్రీన్షాట్
వీడియో యొక్క స్క్రీన్షాట్

నిజ నిర్ధారణ:

పోలీసుల తనిఖీల్లో నారా లోకేష్ నగదుతో పట్టుబడ్డారనే వాదన అవాస్తవమని సౌత్ చెక్ కనుగొంది.

వైరల్ అయిన వీడియో ని లోతుగా విశ్లేషించగా, అందులో రెండు వేర్వేరు ఆడియోలు ఉన్నాయని మేము గమనించాము. ఇందులోని మొదటి ఆడియోలో ‘ టీడీపీ యువనేత నారా లోకేష్  కారును పోలీసులు తనిఖీ చేసారు, ఉండవల్లి కరకట్ట సమీపంలో లోకేష్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీలు జరిపారు’  అంటూ మహిళా న్యూస్ రీడర్ వార్త చదువుతుండడం గమనించవచ్చు.

ఐతే ఈ వార్తలకు సంబంధించిన  న్యూస్  రిపోర్ట్స్ కోసం యూట్యూబ్‌లో వెతకగా ఇదే ఆడియోతో ఉన్న లోకేష్ కాన్వాయ్‌ తనిఖీ ఘటనకు సంబంధించిన ABN వార్తా కథనం మాకు కనిపించింది

ఈ ABN రిపోర్టింగ్ వీడియో యొక్క విజువల్స్ వైరల్ వీడియోలో చూపబడ్డాయి.
అయితే పోలీసుల తనిఖీల్లో నారా లోకేష్ కాన్వాయ్ నుంచి నగదు లేదా ఏదైనా పట్టుబడినట్లు ఈ న్యూస్ రిపోర్టింగ్ వీడియోలో ఎక్కడా వారు పేర్కొనలేదు.

కాగా వైరల్ వీడియోలోని రెండో ఆడియోకు సంబంధించి యూట్యూబ్‌లో వెతకగా అక్టోబర్ 2022లో హైదరాబాద్‌లో ఎనిమిది కోట్ల హవాల డబ్బు పట్టుకున్న వార్తకు సంబంధించిన ETV Telangana రిపోర్ట్ మాకు కనిపించింది. వైరల్ వీడియోలో ఉన్నట్టు ఈ కథనంలో న్యూస్ రీడర్ ‘సుమారు ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబడింది’ అంటూ వార్తను చదువుతూ ఉంటుంది.

దీంతో నారా లోకేష్‌ కాన్వాయ్‌ చెకింగ్‌కు సంబంధించి ABN న్యూస్‌ రిపోర్టింగ్‌ వీడియో యొక్క ప్రారంభ భాగంతో, 2022లో హైదరాబాద్‌లో ఎనిమిది కోట్ల హవాల డబ్బు పట్టుకున్న వార్తకు సంబంధించిన ETV Telangana న్యూస్‌ రిపోర్టింగ్‌ ఆడియోను జోడించి,  పోలీసుల తనిఖీల్లో  నారా లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు పట్టుబడినట్లు తప్పుగా చూపించి వైరల్‌ చేశారని అర్థమైంది.

చివరిగా, పోలీసుల తనిఖీల్లో నారా లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు పట్టుబడినట్లు పేర్కొన్న వీడియోను ఎడిట్ చేసి ఆడియోను డిజిటల్‌గా జోడించినట్లు మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in