Fact Check: పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కాదు కర్ణాటకలో జరిగింది

పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసింది వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు అభినయ్‌రెడ్డి కాదు.
Fact Check: పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కాదు కర్ణాటకలో జరిగింది

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది, డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు దాడి చేసి, రాయితో ముఖంపై కొట్టడం, మనం ఈ వీడియోలో చూడవచ్చు.

అయితే "ఎగ్జామ్ సెంటర్ లో స్లిప్ లు ఇస్తుంటే అడ్డుకున్న పోలీసుని  కొట్టిన వైఎస్‌ఆర్‌సీపీ గంజా యువత…
10వ తరగతి గర్ల్ ఫ్రెండ్ శ్వేత రెడ్డికి స్లిప్ లు సప్లై చేయడానికి వెళ్లి పోలీసుల మీద దాడి చేసిన అభినయ్ రెడ్డి..
జగన్ రెడ్డి నీకో నమస్కారం, ఆంధ్ర సర్వనాశనం చేసావు కద" అనే వాదనతో ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. [ఆర్కైవ్]

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన యువకుడు అభినయ్‌రెడ్డి కాదని, ఆ వాదన అవాస్తవమని సౌత్ చెక్‌ కనుగొంది.

మేము వైరల్ వీడియోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, యూట్యూబ్‌లో Public TV ద్వారా ఒక వీడియో మరియు ఇంటర్నెట్ లో ఆ  సంఘటనను నివేదించిన కొన్ని వార్తా నివేదికలను కనుగొన్నాము.

నిజానికి, మార్చి 20న, తన సోదరిని పీయూ పరీక్షలో కాపీ కొట్టేందుకు అనుమతించకపోవడంతో ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసి అతడి ముఖంపై రాయి విసిరాడు. అఫ్జల్‌పూర్ తాలూకాలోని కరాజాగి [కర్ణాటక రాష్ట్రం] పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

తన సోదరిని పరీక్షలో కాపీ చేయడానికి అనుమతించలేదని నిందితుడు కైలాష్ కానిస్టేబుల్ పండిట్ పాండ్రేపై రాయితో దాడి చేశాడు. వెంటనే పరీక్షా కేంద్రం వద్ద ఉన్న కానిస్టేబుల్‌తో పాటు మరికొందరు అతడిని నిలదీశారు.

పోలీసులు కైలాష్ మరియు అతని సహచరుడు సమీర్‌ను అరెస్టు చేశారు మరియు అఫ్జల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని వార్త నివేదికలు పేర్కొన్నాయి.

అంతేకానీ ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని లేదా వీడియోలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసింది వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు అభినయ్‌రెడ్డి అని పేర్కొన్న వార్తా నివేదిక మాకు కనిపించలేదు.

కాబట్టి, వైరల్ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసింది వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు అభినయ్ రెడ్డి అనే వాదన అబద్ధమని మరియు తప్పుదోవ పట్టించేదిగా మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in