Fact Check: అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్ళీ పట్టుబడ్డాడని వచ్చిన వార్త ఫేక్

అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ RTO ఆఫీసుకి వెళ్లిన ఫోటోని పట్టుకొని అతనిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Fact Check: అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్ళీ పట్టుబడ్డాడని వచ్చిన వార్త ఫేక్

"స్టైలిష్ స్టార్"గా ప్రసిద్ధి చెందిన అల్లు అర్జున్ దేశంలోని అతిపెద్ద నటులలో ఒకరు, అతని ఇటీవలి బ్లాక్ బస్టర్ మూవీ "పుష్ప"తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తన డాన్స్ స్కిల్స్‌కు కూడా పేరుగాంచిన వ్యక్తి. అతను జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు అనేక అవార్డులను అందుకున్నాడు.

తాజాగా, అల్లు అర్జున్ మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడనే వాదనతో అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక X [ట్విట్టర్] వినియోగదారు, X ఖాతాలో రెండు ఫోటోలను పంచుకున్నారు, మొదటి ఫొటోలో అల్లు అర్జున్ ఒక గదిలో పేపర్‌లపై సంతకం చేస్తున్నది, మరియు అతని పక్కన ఒక వ్యక్తిని మనం చూడచ్చు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నిజమేనా?

ఏం జరిగింది ?

ఇంగ్లీషులో ఇలా రాసి మొదటి ఫోటో పోస్ట్ చేయబడింది.

కొన్ని గంటల తర్వాత మొదటి పోస్ట్ కి రిప్లై ఇస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ అల్లు అర్జున్ అని రెండవ ఫోటో పోస్ట్ చేయబడింది. ఈ ఫొటోలో మనం AP09 CU 0666 నెంబర్ ప్లేట్ ఉన్న కారును చూడచ్చు.

నిజ నిర్ధారణ:

అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడన్న వాదన అవాస్తవమని సౌత్ చెక్ కనుగొంది.

వైరల్ పోస్ట్‌లలోని మొదటి ఫోటోను ఉపయోగించి మేము గూగుల్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, ఇది మార్చి 20న ఖైరతాబాద్‌లోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో అల్లు అర్జున్ ఫోటో అని మేము కనుగొన్నాము.

ఖైరతాబాద్‌లోని RTO కార్యాలయాన్ని ఆయన సందర్శించడం గురించి యూట్యూబ్‌లో వెతికినప్పుడు, చాలా వార్తా ఛానెల్‌ల ద్వారా వార్తలు వచ్చాయి.

అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ఖైరతాబాద్ RTO కార్యాలయానికి వెళ్లారు  మరియు తన కొత్త రేంజ్ రోవర్ కారు యొక్క వాహన బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్లు RTO అధికారులు ధృవీకరించినట్లు V6 న్యూస్ మరియు ABN నివేదించాయి.

ఇక వైరల్ పోస్ట్ నుంచి రెండో ఫోటోకి వస్తే, దీనికి సంబంధించి మాకు యూట్యూబ్‌లో "తెలుగు ఫుల్ స్క్రీన్ " ఛానెల్ ద్వారా 2017లో అప్‌లోడ్ చేయబడిన ఒక వీడియో కనిపించింది.

వైరల్ ఫోటోలో కొంత భాగం 'తెలుగు ఫుల్ స్క్రీన్' ద్వారా అప్‌లోడ్ చేయబడిన వీడియో థంబ్‌నెయిల్‌తో సరిపోలింది.

మరియు వైరల్ ఫోటోలో కనిపించే కారుకు సంబంధించి ఫోటో తెలుగు ఫుల్ స్క్రీన్ ద్వారా అదే వీడియో నుండి వచ్చింది.

వీడియోలో , 2014లో డ్రంక్ అండ్ డ్రైవ్ రొటీన్ చెకింగ్‌లో భాగంగా, చెక్ పోస్ట్ వద్ద అల్లు అర్జున్‌ను పోలీసులు ఆపిన సంఘటనను 'తెలుగు ఫుల్ స్క్రీన్' తప్పుగా నివేదించారు.

కానీ నిజానికి, అల్లు అర్జున్ గారిని ఆ చెక్ పోస్ట్ దెగ్గర అందరు చూసేసరికి, వీడియోలు తీయడంతో ఆయన చాల ఇబ్బందిపడ్డారని, కాసేపటి తరువాత పోలీసులకు సహకరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించుకొని అక్కడినుండి వెళ్లిపోయారని తెలిసింది. ఆ రోజు ఆయన AP09 CU 0666 నెంబర్ కారులో ఉన్నారు.

ఆ వైరల్ పోస్టుల వెనుక అసలు నిజాలు ఇవే.

అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లలో ఎప్పుడూ పట్టుబడలేదు, 2014 సంఘటనకు సంబంధించి కూడా అతను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడ్డాడని పుకార్లు వచ్చాయి.

పైగా అల్లు అర్జున్ నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడి ఉంటే, అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ దాని గురించి రిపోర్ట్ చేసి ఉండాలి.

అందుకే, అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడనే వార్తలు అవాస్తవమని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in