Fact Check : పాఠశాల విద్యార్థులు రోడ్డుపై నిరసన తెలిపిన వీడియో తెలంగాణకు చెందినది, ఆంధ్ర ప్రదేశ్ కాదు

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, తెలంగాణలో జరిగింది అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check : పాఠశాల విద్యార్థులు రోడ్డుపై నిరసన తెలిపిన వీడియో తెలంగాణకు చెందినది, ఆంధ్ర ప్రదేశ్ కాదు
Published on
2 min read

ఒక వీడియోలో, పాఠశాల విద్యార్థుల బృందం రోడ్డు పై నిరసన వ్యక్తం చేస్తూ 'CM రావాలి, CM రావాలి అని తమ నిరసన తెలుపుతున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ పిల్లలు రోడ్డు పై నిరసన నిరసన చేస్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? అంటూ ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ సంబంధించినది అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, మేము అదే స్కూల్ పిల్లలతో వీడియో యొక్క అదే వెర్షన్‌ను కనుగొన్నాము,31 ఆగస్టు 2024 న Synewstelugu యూట్యూబ్ ఛానెల్‌లో అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు: కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థినులు అనే టైటిల్ తో ఒక వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో హాస్టల్ లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. CM వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేసిన విద్యార్థులు అని పేర్కొంది.

అంతేకాకుండా, 31 ఆగస్టు 2024 న Prashna Ayudham ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా మరో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు హాస్టల్ లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సమస్య కూడా ఉందని.. ప్రశ్నిస్తే బూతులు పెడుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. హాస్టల్ సిబ్బంది తమ కళ్లలో కారం కొట్టారని వెక్కివెక్కి ఏడ్చారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటూ భయపెడుతున్నారన్నారు. సీఎం వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు అంటూ వైరల్ వీడియోకు సంబంధించిన ఫోటోలతో ఒక కథనాన్ని మేము కనుకున్నాము.

అదనంగా, మేము వైరల్ వీడియోకు సంబంధించి 31 ఆగస్టు 2024 న అదే విషయాన్ని నివేదించిన మరో న్యూస్ రిపోర్టింగ్ ఫోటోలను కనుగొన్నాము.

అందువల్ల, నిజానికి ఈ వైరల్ వీడియో తెలంగాణకు సంబంధించినది, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in