Fact Check: ఏపీలో TDP కూటమి ప్రభుత్వం టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అంటూ వచ్చిన పోస్ట్ నిజం కాదు

ఈ దావా తప్పు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు విడుదల చేయలేదు అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check: ఏపీలో TDP కూటమి ప్రభుత్వం టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అంటూ వచ్చిన పోస్ట్ నిజం కాదు
Published on
1 min read

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ (FRBA) మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ హాజరును నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది, కొత్త హాజరు విధానంతో సాఫ్ట్‌వేర్ స్వయంచాలకంగా రోజువారీ హాజరు మరియు నిష్క్రమణ స్థానాలను అప్‌డేట్ చేస్తుంది మరియు జీతం చెల్లింపును ఏకీకృతం చేస్తుంది. ఈ బయోమెట్రిక్ అమలుతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగ హోల్డర్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు

ఈ నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు చేసుకోని వారిపై చర్యలు తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ వైరల్ అవుతోంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూలై 09న, FactCheck.AP.Gov.in ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం అధికారిక ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము, అందులో ఫేషియల్‌ రికగ్నైజ్డ్‌ అటెండెన్స్‌ సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి షోకాజ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇది అవాస్తవం అని పోస్ట్ చేయబడింది.

అంతేకాకుండా, X లో 2024 జూలై 10న, Telugu Desam Party ఖాతా ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము, అందులో ఏపి ప్రభుత్వం నుంచి ఇలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు, గతంలో ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ తెచ్చి, ఉపాధ్యాయులని పీక్కుతింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తనని ఓడించిన ఉపాధ్యాయుల పై, తాడేపల్లి కొంపలో కూర్చుని, ఫేక్ చేస్తూ, ఈ రకంగా తన సైకోతనం చూపిస్తున్నాడు అని పేర్కొంది.

అదనంగా, మేము వైరల్ అవుతున్న పోస్ట్ గురించి అన్ని వార్తాపత్రికలు మరియు ప్రభుత్వ వెబ్‌సైట్‌లు శోధించినప్పుడు, వైరల్ పోస్ట్ సంబంధించి మాకు ఎటువంటి పోస్ట్ కనిపించలేదు.

అందువల్ల, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in