

Hyderabad: బంగ్లాదేశ్‌లో ముస్లిం పురుషులు ఒక క్రైస్తవ గిరిజన మహిళపై దాడి చేయడాన్ని చూపిస్తుందని వాదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఒక పురుషుడు ఒక మహిళపై దాడి చేస్తూ, బలవంతంగా గుంజీలు తీయిస్తున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది. ఆమె చుట్టూ పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు, ఈ ఘటనను మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేస్తున్నారు. వీడియోపై ఇలా రాసి ఉంది, "క్రిస్టియన్ దళిత మహిళ హిజాబ్ ధరించలేదంటూ నడిరోడ్డుపై బంగ్లాదేశి ఉగ్రజాత్తి రాక్షసకాండ".
ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ, ఒక యూజర్ ఇలా వ్రాశాడు, "క్రిస్టియన్ దళిత మహిళ హిజాబ్ ధరించలేదంటూ నడిరోడ్డుపై బంగ్లాదేశి ఉగ్రజాతి రాక్షసకాండ... ఇప్పుడుకూడా చెప్పుతారా జై భీమ్, జై మీమ్....." (ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ ఈ వాదన తప్పు అని కనుగొంది. ఒక నిర్దిష్ట విద్యార్థి రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉందని భావించి కొంతమంది ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది. ఆమె గిరిజన సమాజానికి చెందిన క్రైస్తవ మహిళ అని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
వైరల్ వీడియో కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి, సెప్టెంబర్ 14, 2024న బంగ్లాదేశ్‌కు చెందిన వార్తా సంస్థ అజ్కేర్ పత్రిక ప్రచురించిన వార్త నివేదిక కనుగొన్నాం. నివేదిక వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌ను కవర్ ఇమేజ్‌గా ఉపయోగించింది.
శీర్షికలో ఇలా ఉంది, “దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, కాక్‌స్బజార్ బీచ్‌లో వేధింపులకు గురైన బాధితులు థర్డ్ జెండర్‌కు చెందినవారు.” అని ఉంది. ఆ నివేదిక ప్రకారం, కాక్స్ బజార్‌లోని సుగంధ బీచ్ ప్రాంతంలో అనేక మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై మహ్మద్ ఫారుకుల్ ఇస్లాం దాడి చేశాడు.
బాధితురాలు అరోహి ఇస్లాం అని, ఆమె తనను ఇతర బాధితులను/సాక్షులను థర్డ్ జెండర్‌కు చెందినవారిగా గుర్తించిందని అజ్కేర్ పత్రిక నివేదిక పేర్కొంది.
అదే రోజు మరొక బంగ్లాదేశ్ వార్తా వెబ్‌సైట్ ప్రోథోమ్ అలో ఇంగ్లీష్ ప్రచురించిన నివేదికలో, "ఫరోకుల్ తనను తాను స్టూడెంట్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ 'కోఆర్డినేటర్' అని చెప్పుకుంటున్నాడు. ఈ విద్యార్థి సంఘం షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన సామూహిక తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఫరోకుల్ చాలా రోజులుగా సముద్ర తీర ప్రాంతంలో వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని స్థానిక వ్యాపారులు తెలిపారు" అని పేర్కొంది.
ఈ సంఘటన గురించి అనేక ది డైలీ పోస్ట్, ఢాకా ట్రిబ్యూన్, దైనిక్ బంగ్లా, బీబీసీ బంగ్లా వంటి వివిధ బంగ్లాదేశ్ వార్తా సంస్థలు నివేదికలు ప్రచురించాయి. బాధితురాలు అరోహి ఇస్లాం \ థర్డ్ జెండర్‌కు చెందిన ముస్లిం అని ఈ నివేదికలు ధ్రువీకరించాయి. ఈ సంఘటన సెప్టెంబర్ 11న జరిగింది. బాధితురాలు క్రైస్తవ గిరిజన మహిళ అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఈ నివేదికలలో లేవు.
ఛానల్ ఐ న్యూస్ సెప్టెంబర్ 14, 2024న తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో షేర్ చేసింది. "బీచ్‌లో మహిళను వేధించినందుకు కేసు నమోదు; యువకుడిని అరెస్టు చేశారు... కాక్స్ బజార్ సముద్ర బీచ్‌లో ఒక మహిళ చెవులు పట్టుకుని గుంజీలు తీయమని బలవంతం చేసి కొట్టిన సంఘటనలో కేసు నమోదు చేయబడింది. వేధింపులకు గురైన మహిళ ఆరోహి ఇస్లాం ఇద్దరు నిందితులను (మోడల్ పోలీస్ స్టేషన్ కేసు నం. 40/24) పేర్కొంటూ కేసు నమోదు చేసింది," అని రాశారు.
వీడియోలో ఆరోహి ఇస్లాం, కాక్స్ బజార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జాసిం ఉద్దీన్ చౌదరి ఈ సంఘటన గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
వీడియోలో, ఆరోహి ఇస్లాం తాను ఒక పర్యాటకురాలని చెబుతోంది. దాడి చేసిన వ్యక్తులు ఆమెను సెక్స్ వర్కర్ అని ఆరోపించి, ఆమెను ఛత్రా లీగ్ సభ్యురాలిగా తప్పుగా గుర్తించారాని పేర్కొంది. బంగ్లాదేశ్ ఛత్రా లీగ్ (BCL) అనేది షేక్ హసీనా నేతృత్వంలోని పార్టీ అయిన అవామీ లీగ్ యొక్క అధికారిక విద్యార్థి విభాగం.
"అతను నన్ను సెక్స్ వర్కర్ అని కూడా నిందించాడు. నేను అలా చేస్తే, అతను నన్ను వ్యభిచార గృహంలో, రెడ్ లైట్ ఏరియాలో లేదా హోటల్‌లో కనుగొని ఉండేవాడు లేదా ఒక వ్యక్తితో చట్టవిరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్లు నన్ను పట్టుకునేవాడు. అప్పుడే అతను నాపై నిందలు వేయగలడు" అని అరోహి ఇస్లాం అన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ, "నేను నిలబడి నా ఫోన్‌ను ఉపయోగిస్తున్నాను. అతను అకస్మాత్తుగా వచ్చి దాన్ని లాక్కున్నాడు. నేను ఎందుకు అని అడిగినప్పుడు, అతను నన్ను చెంపదెబ్బ కొట్టి, 'నువ్వు ఛత్రా లీగ్ కార్యకర్తవని; నువ్వు విద్యార్థి ఉద్యమంలో కనిపించావు' అని అన్నాడు. అతను నేను ఛత్రా లీగ్‌లో ఉన్నానని ఆరోపించినందుకు, అతను రుజువు చూపించాలి - ఫోటో, విద్యార్థి నిరసనలలో నేను ఉన్నట్లు చూపిస్తున్న వీడియో, ఏదైనా చూపించాలి."
ఈ వీడియోలో ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని అవామీ లీగ్ విద్యార్థి విభాగం సభ్యురాలిగా తప్పుగా గుర్తించి దాడి చేయడం చూపిస్తుంది. కాబట్టి , వైరల్ వాదన తప్పు అని సౌత్ చెక్ తేల్చింది.