Fact Check : ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు ఉండగానే, కుప్పకూలిన క్లాస్రూమ్ గోడ అంటూ వచ్చిన వీడియో ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాదు

Fact Check : ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు ఉండగానే, కుప్పకూలిన క్లాస్రూమ్ గోడ అంటూ వచ్చిన వీడియో ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాదు

నిజానికి ఈ వైరల్ వీడియో పోస్ట్ గుజరాత్‌లో జరిగిన నారాయణ్‌ విద్యాలయంలో ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీ.
Published on

విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఉండగా ఒక్కసారిగా ఆ గది గోడ కుప్పకూలిపోవడంతో ఆ గోడ పక్కనే ఉన్న విద్యార్థులు బెంచీలతో సహా కింద పడిపోయారు మిగిలిన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు పెడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో, జగన్ ప్రభుత్వ హయాంలో కట్టించిన పాఠశాలలో పాఠాలు చెప్పకుండా పాడుబడిన బడిలో పాఠాలు చెప్పి పిల్లల ప్రాణాలు తీసిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనే వాదనతో సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ వీడియో గుజరాత్‌ వడోదరలో శ్రీ నారాయణ్‌ గురుకుల విద్యాలయంలో జరిగింది అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న వీడియో పోస్టుకు సంబంధించి కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు, 2024 జూలై 20న TIMES NOW ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో గుజరాత్‌ వడోదరలో నారాయణ్‌ విద్యాలయంలో విద్యార్థులు లంచ్ చేస్తున్న సమయంలో తరగతి గది గోడ కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్ గోడ కూలి పోయిన ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. తరగతి గోడ కూలిపోయి, స్టూడెంట్స్ సైకిల్ పార్కింగ్ చేసే స్థలంలో పడిపోయింది. 19.07.2024న శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది అంటూ వైరల్ అవుతున్న వీడియోతో కథనాన్ని ప్రచురించబడింది

అంతేకాకుండా, 2024 జూలై 20న గుజరాత్‌లోని వడోదరలో పాఠశాల తరగతి గది గోడ కూలిపోవడంతో విద్యార్థులు గాయపడ్డారు. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో తరగతి గది ఉంది. పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం 19.07.2024 శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భోజన విరామ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ న్యూస్ మీటర్ తెలుగు కూడా ఈ ఘటనను వైరల్ వీడియోతో పాటు నివేదించింది.

అదనంగా, X లో 2024 జూలై 21న FactCheck.AP.Gov.in ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ఈ దుర్ఘటన గుజరాత్ లో జరిగింది. కొందరు దురుద్దేశ్యంతో ఇది ఏపీలో జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. వీరు చట్టరీత్యా శిక్షార్హులు పేర్కొంది.

అందువల్ల, ఈ వైరల్ వీడియో గుజరాత్‌కు సంబంధించినది, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేము నిర్ధారించాము.

logo
South Check
southcheck.in