Fact Check : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో ఎడిట్ చేయబడింది.

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో ఎడిట్ చేయబడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల NDA కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశం 2024 జూన్ 21న ప్రారంభించి రెండు రోజుల శాసనసభ సమావేశాలు నిర్వహించారు ఐతే మొదటి రోజు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేయగా అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు ఈ సమావేశాలు మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌మాణం చేశారు.

ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరస్పరం చేయి పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు సవరించబడింది అని సౌత్ చెక్ కనుగొంది

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను సోదిచడానికి, రెండు రోజుల శాసనసభ సమావేశాలు వివిధ మీడియా ప్రత్యక్ష ప్రసారాలను పరిశీలించినప్పుడు, శాసనసభ సమావేశాల్లో తొలిరోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు ఐతే ప్రమాణం చేసిన అనంతరం ప్రతి అభ్యర్థి ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ను శుభాకాంక్షలు చెబుతున్న దృశ్యాన్ని మరింత గమనించాము

ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణం చేసిన అనంతరం ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పలకరించి శుభాకాంక్షలు చెబుతున్న ఒక సన్నివేశంలో మేము గమనించినప్పుడు, పవన్‌ కళ్యాణ్‌ శుభాకాంక్షలు చెబుతున్న సన్నివేశంకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోకి పోలికలు ఉన్నట్లు గమనించాము

ఆ తర్వాత పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డిల ప్రమాణ స్వీకార సన్నివేశాలను జాగ్రత్తగా వీక్షించినప్పుడు కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి స్పీకర్‌ను శుభాకాంక్షలు చెబుతున్న రెండు వేర్వేరు సన్నివేశాలను స్క్రీన్‌షాట్ తీసి స్పీకర్ ఫోటో స్థానంలో జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని నిర్ధారించాము

అదనంగా, వివిధ మీడియా ప్రత్యక్ష ప్రసారాలను మరియు మీడియా నివేదికలు చూసినపుడు పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డిల కలిసి ఉన్న అసెంబ్లీ విజువల్స్ ఎక్కడా కనిపించలేదు కానీ వీరు కలిసి షేక్ హ్యాండ్ చెప్పుకున్నట్లు ఉన్న ఫోటో మాత్రం వైరల్ అవుతోంది.‌

అందువల్ల, వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ ఇద్దరూ కలిసి పరస్పరం చేయి పట్టుకున్నారు అంటూ వైరల్ అవుతున్న ఫోటో సవరించబడింది అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in