Fact Check: తిరుమల శ్రీవారి సన్నిధిలో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్న డిమాండ్‌కు మంత్రి రోజా మద్దతు ఇవ్వలేదు

అమరావతి అంటూ మనసులో మాట బయటపెట్టిన రోజా... తిరుమల శ్రీవారి సన్నిధి లో “జై అమరావతి” అని రాజధానికి మద్దతు పలికిన రోజా రెడ్డి !
Fact Check: తిరుమల శ్రీవారి సన్నిధిలో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్న డిమాండ్‌కు మంత్రి రోజా మద్దతు ఇవ్వలేదు

2వ ఫిబ్రవరి 2024న, మంత్రి రోజా తిరుపతికి వెళ్లగా, దర్శనం తర్వాత, అకస్మాత్తుగా కొంతమంది మహిళలు ఆమె చుట్టూ గుమిగూడి "జై అమరావతి" అని నినాదాలు చేయడం ప్రారంభించారు.

ఈ వీడియోకు సంబంధించి ఓ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

"అమరావతి అంటూ మనసులో మాట బయటపెట్టిన రోజా...తిరుమల శ్రీవారి సన్నిధి లో “జై అమరావతి” అని రాజధానికి మద్దతు పలికిన రోజా రెడ్డి ! @RojaSelvamaniRK

మరి జగన్ రెడ్డి మనసు మారుతుందో లేదో" అని పోస్ట్ పేర్కొంది.

"జై అమరావతి" అంటూ వారి డిమాండ్‌కు రోజా నిజంగా మద్దతిచ్చిందా?

ఈ పోస్ట్ ఎంత వరకు నిజం?

నిజ నిర్ధారణ:

సౌత్ చెక్, వీడియోను లోతుగా విశ్లేషించిన తర్వాత పోస్ట్ నకిలీదని మరియు తప్పుదారి పట్టించేదని కనుగొంది.

ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం మంత్రి రోజా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆమె దర్శనం ముగించుకుని బయటకు వస్తుండగా, ఆమె చుట్టూ గుమిగూడిన కొంతమంది మహిళలు "జై అమరావతి" అని నినాదాలు చేయడం చూసి ఆశ్చర్యపోయారు.

ఆ మహిళలు శ్రీవారి సన్నిధిలో సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్లు.

రోజాను చూడగానే సెల్ఫీలు అడుగుతూ అమరావతి నుంచి వచ్చామని చెప్పారు. వెంటనే వారు "జై అమరావతి" అని నినాదాలు చేయడం ప్రారంభించారు మరియు అమరావతిని ఆంధ్ర ప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా చేయాలనే తమ డిమాండ్‌కు మద్దతుగా "జై అమరావతి" అని చెప్పాలని రోజాను కోరారు.

వారి డిమాండ్‌ను పట్టించుకోకుండా మంత్రి రోజా కేవలం నవ్వుతూ జనాల నుంచి వెళ్లిపోయారు. ఆమె సెల్ఫీలు మాత్రమే ఇచ్చింది, అమరావతి గురించి మరియు వారి డిమాండ్ గురించి ఏమీ చెప్పలేదు.

ఈ అంశంపై తిరుపతి దేవస్థానం విజిలెన్స్ బృందం విచారణ జరుపుతోంది.

కానీ, వైరల్ పోస్ట్ చెప్పినట్లుగా, “జై అమరావతి” అని రోజా చెప్పడం మనం విడియో లో ఎక్కడ చూడలేదు మరియు వారి డిమాండ్‌కు ఆమె మద్దతుని ఏ ఒక్క మీడియా కూడా నివేదించలేదు.

అందుకే, మంత్రి రోజా "జై అమరావతి" అంటూ ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి, అనే డిమాండ్‌కు మద్దతిచ్చారని చెబుతున్న పోస్ట్ పూర్తిగా ఫేక్.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in