
హైదరాబాద్: సెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని,
"పార్లమెంట్ ఆవరణంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు... Narendra Modi జీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్...... మేరీ మేరీ క్రిస్మస్....." అంటూ పలు సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
సౌత్ చెక్ ఈ క్లెయిమ్‌ను తప్పుగా నిర్ధారించింది.
దీనికి సంబంధించి, ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా పరిశీలించగా, మాకు అదే రోజు ఈ ఫోటోలను షేర్ చేస్తూ,
"కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యాను. క్రైస్తవ సమాజ ప్రముఖులతో సంభాషించాను"
అని వ్యాఖ్యానించారు.
ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రధాని మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా షేర్ చేయబడ్డాయి.
మరిన్ని వివరాల కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా, 2024 డిసెంబర్ 20న ఇండియా టుడే వెబ్‌సైట్‌లో ప్రచురితమైన “కేంద్ర మంత్రి స్వగృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చిత్రాలను చూడండి” అనే కథనం ఒకటి లభించింది.
ఈ కథనం ప్రకారం, ఈ ఫోటోలు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినవి.
పలు వార్తా సంస్థలు ఈ కథనాన్ని రిపోర్ట్ చేశాయి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
భారత పార్లమెంట్ ఆవరణలో క్రిస్మస్ వేడుకలు జరిగాయా? అని తగిన కీవర్డ్స్ ద్వారా వెతికినా, ఇలాంటి వేడుకలకు సంబంధించిన విశ్వసనీయ ఆధారాలు లభించలేదు.
కాబట్టి, ఈ ఫోటోలు 2024 డిసెంబర్ 19న ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినవి.