Fact Check : మెగా DSC కాదు దగా DSC అని నిరుద్యోగులు చేస్తున్న నిరసనలు అంటూ వచ్చిన వీడియో నిజానికి తెలంగాణలోనిది

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check : మెగా DSC కాదు దగా DSC అని నిరుద్యోగులు చేస్తున్న నిరసనలు అంటూ వచ్చిన వీడియో నిజానికి తెలంగాణలోనిది

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నట్లుగానే తాను సీఎంగా బాధ్యతలు తీసుకోగానే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేసి టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు కొత్త ప్రభుత్వం 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీల ప్రకారం, నిరుద్యోగ యువత కోసం ఇవ్వనున్న మెగా DSC దగా DSC అని మరియు పోస్ట్‌లు పెంచాలని నిరుద్యోగులు చేస్తున్న నిరసన అంటూ ఓ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఆ వీడియో తెలంగాణకు సంబంధించినది అని సౌత్ చెక్ కనుగొంది

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూన్ 30న, News Line Telugu ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది ABN, V6, ఈనాడు మా సమస్యలు చూపించడం లేదు అంటూ నిరుద్యోగులు చేస్తున్న నిరసనలు సంబంధిత వైరల్ వీడియో మేము కనుగొన్నాము

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను గమనించినపుడు ఆ వీడియోలో నిరసనకారులు గ్రూప్ 3 పోస్టులను పెంచండి మరియు డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేయాలని అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతూ కనిపించారు

అయితే ఆ వీడియోని మరింత శోధిస్తున్నప్పుడు, 2024 జూన్ 30న, Telangana Today ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాల‌ని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని, గ్రూప్-2, 3 రాత‌ప‌రీక్ష‌ల‌ను డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేయాలని మరియు జీవో 46ను ర‌ద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ధ‌ర్నాకు దిగారు.

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేస్తోందని నిరసనకారులు విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారి సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే, ఈ రోజు వరకు, నిరుద్యోగ ఆందోళనలు పరిష్కరించబడలేదు అని నిరసన తెలిపారు

అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు, తెలంగాణకు సంబంధిచినది అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in