Fact Check: శ్రీలంక వరదల్లో ఏనుగు కుక్కని కాపాడుతున్న నిజమైన దృశ్యాలా? కాదు, ఇది AI-జనరేటెడ్ వీడియో

శ్రీలంకలో వచ్చిన వరదల నేపథ్యంలో, ఏనుగు కుక్కను, రక్షిస్తుంది అని చెప్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా షేర్ అవుతుంది.
In the wake of the floods in Sri Lanka, some videos are being shared widely on social media, claiming to show an elephant saving a dog.
Published on
2 min read

Hyderabad: దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంకలో తీవ్రమైన వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో, ఏనుగు వరదలో చిక్కుకున్న కుక్కను కాపాడుతున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుతుంది. 

ఒక ఫేస్‌బుక్ యూజర్ వీడియో ను షేర్ చేస్తూ, “ కుక్కను కాపాడిన ఏనుగు” అనే క్యాప్షన్ తో రాశాడు. (Archive)

Fact Check

సౌత్ చెక్ పరిశీలనలో ఈ వీడియో తప్పు అని తేలింది. ఇది అసలు వీడియో కాదు - AI సాయంతో సృష్టించబడిన కృత్రిమ వీడియో.
ముందుగా, కీవర్డ్ సెర్చ్ ద్వారా పరిశీలించగా, 2025లో శ్రీలంక వరదల సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. 
ఈ వైరల్ వీడియోలోని కీఫ్రేమ్స్‌ను విడదీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా,అయితే, సెర్చ్ ఫలితాలలో ఇదే వీడియో టిక్‌టాక్‌లో ‘Contains AI-generated media’ లేదా అనే ట్యాగుతో ఉన్న పోస్టు మాకు కనిపించింది.

​​వీడియోలు ఉన్న ఈ పేజీలు అంతటా అనేక AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నట్టు స్పష్టమైంది.
తదుపరి ధృవీకరణ కోసం, హైవ్ అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్ ద్వారా ఈ వీడియోను పరిశీలించాము. హైవ్ విశ్లేషణలో ఈ వీడియో AI‌తో తయారు చేసిన వీడియో అని స్పష్టమైంది.

అందువల్ల, వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు నిజమైన రక్షణ వీడియో కాదు. ఇది AI-తో రూపొందించిన వీడియో మాత్రమే.

అందువల్ల, సౌత్ చెక్ ఈ క్లెయిమ్‌ను తప్పు అని నిర్ధారించింది.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in