Fact Check: మైక్ విసిరి కొట్టి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటూ వచ్చిన వార్తల్లో నిజమెంత?

వాస్తవానికి వైరల్ అయిన వీడియో ఎడిట్ చేయబడింది అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check: మైక్ విసిరి కొట్టి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్  అంటూ వచ్చిన వార్తల్లో నిజమెంత?
Published on
2 min read

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ పరిపాలన రంగంలో వరుసగా సమీక్షలు చేస్తూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తంగా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, విలేకరుల సమావేశంలో అసహనంతో మైక్ విసిరి కొట్టి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటూ ఒక వీడియో పోస్ట్ వైరల్‌గా మారింది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను సోదిచడానికి, పారిశుద్ధ్య కార్యకలాపాలు మరియు ఘన ద్రవ వనరుల నిర్వహణ పద్ధతులపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 2024 జూలై 13న విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారాలను చూశాం. మేము ఈ వీడియో చూస్తున్నప్పుడు, PPT ప్రెసెంటేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ అధికారులు మరియు విలేకరులతో మాట్లాడుతుండగా మైక్ పని చేయలేదు, అధికారులు మైకు మార్చేందుకు ప్రయత్నించారు కానీ పవన్ కళ్యాణ్ లేచి నిలబడి పోడియం మైక్ దగ్గరకు వెళ్లి ప్రసంగాన్ని కొనసాగించారు.

పవన్ కళ్యాణ్ పోయిన మైక్ ని టేబుల్ మీద పెట్టి లేచి నిలబడి పోడియం మైక్ దగ్గరకు వెళ్తున్నపుడు వీడియోను 20:50 సెకన్లు నుంచి సెకన్లు 23:47 వరకు ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మేము నిర్ధారించాము.

అంతేకాకుండా, మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూలై 12న M9 NEWS ఖాతా ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము, అందులో పవన్ కళ్యాణ్ పై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం, విడియోను అసందర్భంగా కట్ చేసి పవన్ కళ్యాణ్ మైక్ విసిరికొట్టినట్టు ప్రచారం అంటూ అసలు వీడియోను పోస్ట్ చేయబడింది.

అదనంగా, M9 ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక వార్తా నివేదిక కనుగొన్నాము, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ఆ వీడియోను కట్ చేసి పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి టేబుల్ పై ఉన్న మైక్ పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పేర్కొంది.

అందువల్ల, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in