Fact Check : ప్రజలు చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారంటూ వచ్చిన వీడియో తెలంగాణకు చెందినది కాదు

వాస్తవానికి వైరల్ అయిన వీడియో పాతది మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినది కాదు అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check : ప్రజలు చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారంటూ వచ్చిన వీడియో తెలంగాణకు చెందినది కాదు
Published on
2 min read

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన TDP అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారిగా 2024 జూలై 06న హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు ఈ సమావేశం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఫోటో ఉన్న ఫ్లెక్సీని చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియా ఖాతాలో వైరల్ అవుతూ ఉంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియో పాతది మరియు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది తెలంగాణకు సంబంధించినది కాదు అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ వీడియోని గమనించినప్పుడు, చంద్రబాబు ఫ్లెక్స్‌ను కొట్టిన కొందరు వ్యక్తులు టీడీపీ వాళ్లుగా గుర్తుచబడడంతో మేము టీడీపీ సభ్యుల చర్యల వెనుక గల కారణాలు ఏంటి అని విచారణ జరిపితే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని మార్చడంతో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరియు నిరసనలను తెలియచేసినపూడి వీడియో అని మరియు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పాత వీడియో అని సౌత్ చెక్ నిర్ధారించింది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, ఏప్రిల్ 21, 2024 న Samayam తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో TDP Workers Protest In Madakasira అనే టైటిల్ తో ఒక వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ ను కాదని ఎంఎస్ రాజును అభ్యర్థిగా ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. నారా లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను కార్యకర్తలు చెప్పులతో కొట్టారు.

అంతేకాకుండా, ఏప్రిల్ 21, 2024 న Deccan Chronicle ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా Denied Tickets, TDP Leaders Hit Babu's Picture With Footwear అనే టైటిల్ తో వార్తా నివేదిక కనుగొన్నాము, అందులో డాక్టర్ సునీల్ స్థానంలో పార్టీ ఎస్సీ నాయకుడు ఎంఎస్ రాజ్‌కు మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయించడంతో ఆయన అనుచరుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆగ్రహించిన సునీల్ అనుచరులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ ఫోటోను చెప్పులతో కొట్టారు అంటూ ప్రచురించబడిన కథనాన్ని మేము కనుగొన్నాము.

అందువల్ల, తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఫోటో ఉన్న ఫ్లెక్సీని చెప్పుతో కొడుతున్నారు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in