Fact Check: త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి లేదా మీ అందరి బండారం బయట పెడతా, కేటీఆర్ హరీష్‌లకు కవిత వార్నింగ్ అంటూ వచ్చిన కథనం ఫేక్

Fact Check: త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి లేదా మీ అందరి బండారం బయట పెడతా, కేటీఆర్ హరీష్‌లకు కవిత వార్నింగ్ అంటూ వచ్చిన కథనం ఫేక్

'నా తెలంగాణ' దినపత్రిక ఈ కథనాన్ని ప్రచురించలేదు.
Published on

భారత రాష్ట్ర సమితి [BRS] శాసనసభ్యురాలు కె. కవిత మార్చి 26 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ [ED] కస్టడీలో ఉంటారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శ్రీమతి కవిత నిందితురాలిగా ఉన్నారు, మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె ఇంటి నుండి, ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు .

ఈ నేపథ్యంలో 'నా తెలంగాణ' ప్రచురించిన ఓ వార్తా కథనానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి లేదా మీ అందరి బండారం బయట పెడతా, కేటీఆర్ హరీష్‌లకు కవిత వార్నింగ్" అనే హెడ్లైన్ తో ఈ కథనాన్ని అనేక మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. [ఆర్కైవ్ లింక్ ఇక్కడ]

నిజ నిర్ధారణ:

నా తెలంగాణ పేరుతో ప్రచురితమైన ఈ వార్తా కథనం ఫేక్ అని సౌత్ చెక్ తేల్చింది.

మేము వైరల్ వార్తా కథనంలో కనిపించే కథన లింక్‌ని ఉపయోగించి వెతికినప్పుడు, 25వ జనవరి 2024న, నా తెలంగాణ వార్తాపత్రిక ప్రచురించిన, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ మరియు INDIA కూటమికి సంబంధించిన కథనాన్ని కనుగొన్నాము.

అలాగే వైరల్ కథనంలో డేట్ ఆధారంగా వెతకగా 21 మార్చి 2024 నాడు ‘నా తెలంగాణ’ ఇలాంటి వార్త ఏదీ ప్రచురించలేదని తెలిసింది. దీన్నిబట్టి  అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ మరియు INDIA కూటమికి సంబంధించిన వార్తా కథనాన్ని డిజిటల్‌గా ఎడిట్ చేసి ఈ వ్యాఖ్యలను కె. కవితకు తప్పుగా ఆపాదించినట్టు స్పష్టమవుతుంది.

అంతేకాకుండా వైరల్ వార్తా కథనంలోని రచనా శైలి అసాధారణంగా మరియు ప్రామాణికత లేనిదిగా కనిపిస్తుంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, మీడియా, న్యూస్ ఛానళ్లు దాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి.

అందువల్ల, కవిత తన బెయిల్ విషయంలో కెటిఆర్ మరియు హరీష్ రావులను హెచ్చరించినట్లు వైరల్ వార్తా కథనం ఫేక్ అని మేము నిర్ధారించాము.

logo
South Check
southcheck.in