Fact Check: ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ కార్యకర్తలు ప్రభుత్వ అధికారిని కొట్టడాన్ని వీడియో చూపిస్తుంది

ఈ ఘటన మహారాష్ట్రలో ఒక బ్యాంక్ మేనేజర్‌ పై జరిగింది అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check: ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ కార్యకర్తలు ప్రభుత్వ అధికారిని కొట్టడాన్ని వీడియో చూపిస్తుంది
Published on
2 min read

ఓ వ్యక్తి , అధికారి పై దాడి చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ లో , ఒక ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చూడకుండా, ఒక సంతకం పెట్టలేదని డ్యూటీలో ఉన్న అధికారినీ కొట్టిన TDP గుండాలు అంటూ ఓ వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చూడకుండా కొట్టిన YSRCP గుండాలు అందుకేనేమో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టీడీపీ కూటమి పార్టీకి ఓటేశారు అనే వాదనతో మరో పోస్ట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ

నిజ నిర్ధారణ:

ఈ దావా తప్పు అని మరియు తప్పుదారి పట్టించేదని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ వీడియోకు సంబంధించి రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, ఒక వార్తా నివేదికను కనుగొన్నాము.

2024 ఆగస్టు 14న Gujarat First ఆన్‌లైన్ వార్తా ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్‌పై దాడి చేశారు, కారణం ఏమిటి? వీడియో చూడండి అనే టైటిల్ తో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో జల్నా జిల్లాలోని జఫ్రాబాద్ ప్రాంతంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్ ధీరేంద్ర కుమార్ సోంకర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు.

తమను రైతు సంఘం సభ్యులుగా గుర్తించి రైతులకు రుణాలు ఇవ్వకుండా మేనేజర్ వెనక్కి పంపుతున్నారని ఆరోపిస్తూ, ఆగస్టు 13వ తేదీ ఉదయం కొందరు వ్యక్తులు బ్యాంక్ మేనేజర్ క్యాబిన్‌లోకి వెళ్లి మేనేజర్ ధీరేంద్ర కుమార్ పై దాడి చేశారు.

బ్యాంకు మేనేజర్ ధీరేంద్ర కుమార్ సోంకర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో జరిగిన మొత్తం ఘటనను వివరించగా నిందితులపై ఐపీసీ 132, 121(1), 296, 189(2), 191(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అంటూ వైరల్ వీడియోతో వార్తా కథనం ప్రచురించబడింది.

అంతేకాకుండా, 2024 ఆగస్టు 14న Indian Express ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా మరో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో స్వాభిమాని షెత్కారీ సంఘటనా యువజన విభాగం అధ్యక్షుడు మయూర్ బోర్డు మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో రైతులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌ని చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కింది. పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు మొదలైన వివిధ బ్యాంకు సేవలను పొందడంలో బ్రాంచ్ మేనేజర్ సహకరించకపోవడం పై రైతులు మరియు ఇతరుల నుండి బోర్డే ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత ఈ సంఘటన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని వరుద్ శాఖలో జరిగింది వైరల్ వీడియోకి సంబంధించిన ఫోటోలుతో ఆ నివేదిక పేర్కొంది.

అదనంగా, X లో 2024 ఆగస్టు 04న, FactCheck.AP.Gov.in ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో మహారాష్ట్రలో ఒక బ్యాంక్ మేనేజర్‌పై జరిగిన దాడిని ఏపీలో జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని పేర్కొంది.

అందువల్ల, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి అనే వాదన అబద్ధమని మరియు తప్పుదోవ పట్టించేదిగా మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in