Fact Check: ఓం బిర్లా కూతురు ముస్లీం అబ్బాయిని పెళ్లి చేసుకుందా.? వైరల్ పోస్టుల‌లో నిజమెంత‌

అంజలి బిర్లా ముస్లిం అయిన అనీష్ రజనీ అనే వ్యక్తిని పెళ్లాడిందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు.
Om Birla's daughter Anjali married a Muslim man? Viral claim is false
Published on
2 min read

ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా ఒక IAS అధికారి. గత నవంబర్ 12, 2024న రాజస్థాన్ లోని కోట లో అనీష్ రజనీ తో వివాహం జరిగింది. 

ఈ క్రమంలో, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఓం బిర్లా కుమార్తె ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందని, అనీష్ రజనీ ముస్లిం మతానికి చెందినవాడని ఆరోపిస్తూ పోస్ట్లు చేశారు.


ఒక X యూజర్ నవ వధూవరులు నృత్యం చేస్తున్న వీడియో పోస్ట్ చేస్తూ "స్పీకర్ ఓం బిర్లా తన కుమార్తె అంజలి బిర్లాను ముస్లిం కుటుంబానికి చెందిన అనీష్ రజనీకి వివాహం చేయించారు. మన యువ హిందూ సమాజం మసీదుల ముందు డీజే వాయిస్తూ, ముస్లింల పైకప్పుల నుండి జెండాలను దించే పనిలో నిమగ్నమై ఉంది. అంధ భక్తులారా, ఇప్పుడు మీ కళ్ళు తెరవండి " అని ట్వీట్ చేశారు.(Archive)

Om Birla's daughter Anjali married a Muslim man? Viral claim is false

ఫ్యాక్ట్ చెకింగ్:

Newsmeter వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఓం బిర్లా కార్యాలయం కూడా అంజలి బిర్లా ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారనే వాదన అవాస్తవమని పేర్కొంది.

దీనికి సంబంధించి మేము కీవర్డ్ సెర్చ్ చేయగా, మాకు నవంబర్ 13న NDTV రాజస్థాన్ లో ప్రచురితమైన కథనం లభించింది. ఈ కథనం అనీష్ రజనీ సింధీ కుటుంబం నుండి వచ్చినట్లు పేర్కొంది. అతని తండ్రి, నరేష్ రజనీ, కోటా లో చమురు పరిశ్రమలో పనిచేసే ఒక ప్రసిద్ధ హిందూ వ్యాపారవేత్త. నరేష్ రజనీ సనాతన ధర్మానికి సంబంధించిన ఆలయ నిర్మాణం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంతో సహా సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడంలో స్థానికంగా గుర్తింపు పొందారు.

అంజలి, అనీష్ పాఠశాలలో స్నేహితులుగా ఉండేవారని, ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారని కూడా ఈ నివేదిక హైలైట్ చేసింది.  ప్రస్తుతం అనీష్,  రజనీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎకెఆర్ గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్, ప్రైమెరో వేస్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ధనీష్ ట్రేడ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఆర్క్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో సహా ఐదు కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు.

నవభారత్ టైమ్స్ (నవంబర్ 13) మరియు న్యూస్ తక్ (నవంబర్ 14) అనీష్ రజనీ గురించి వైరల్ అయిన వాదనను ప్రచురించాయి. అనీష్ సింధీ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఈ నివేదికలు స్పష్టం చేశాయి. అతను ముస్లిం అని ప్రచారం అవుతున్న వాదన తప్పు అని పేర్కొన్నారు. 

భారతీయ జనతా పార్టీ నాయకుడు, గయా మాజీ ఎంపీ హరి మాంఝీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అనీష్ రజనీ, అంజలి బిర్లాల వివాహ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు. అనీష్ సిమ్రాన్ మరియు నరేష్ రజనీల కుమారుడని, అంజలి శకుంతల మరియు ఓం బిర్లాల కుమార్తె అని ఆ కార్డులో ఉంది. 

తన పోస్ట్లో, మాంఝీ వైరల్  అవుతున్న వాదనలను తోసిపుచ్చారు,  అనీష్ కోటాలోని ఒక వ్యాపార కుటుంబానికి చెందిన సింధీ హిందువు అని స్పష్టం చేశారు. రజనీ కుటుంబం శివునికి 12కి పైగా ఆలయాలు నిర్మించేందుకు సహకరించిందని ఆయన పేర్కొన్నారు. 

అందువల్ల, అంజలి బిర్లా ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in