ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌ టపాసుల షాపులో అగ్నిప్రమాదం - ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లోని బోగులకుంట హనుమాన్ టేకిడిలోని పరాస్ బాణసంచా దుకాణంలో అక్టోబర్ 30 ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. క్షణాల్లో టపాసులన్నీ అంటుకున్నాయి. పక్కనే ఉన్న రెస్టారెంట్‌ పై కూడా టపాసుల పేలుడు ఘటన ప్రభావం చూపించింది.
ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌ టపాసుల షాపులో అగ్నిప్రమాదం - ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
Published on
2 min read

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లోని బోగులకుంట హనుమాన్ టేకిడిలోని పరాస్ బాణసంచా దుకాణంలో అక్టోబర్ 30 ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. క్షణాల్లో టపాసులన్నీ అంటుకున్నాయి. పక్కనే ఉన్న రెస్టారెంట్‌ పై కూడా టపాసుల పేలుడు ఘటన  ప్రభావం చూపించింది.  

అగ్నిమాపక, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగారు

ఈ నేపథ్యంలో షాపులో మంటలు చెలరేగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మంటలు ముప్పై ఐదు మంది మరణానికి కారణమయ్యాయని చెబుతున్నారు.

ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వీడియోను షేర్ చేస్తూ, “దేవుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. (ఆర్కైవ్)" అంటూ పోస్టు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

SouthCHECK  బృందం వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ధృవీకరించింది.

 అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ చారి SouthCHECK కు  ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ "ఒక మహిళ చేయికి గాయమైంది, ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మరో ఇద్దరు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారు, వారంతా బాగానే ఉన్నారు.  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు." అని తెలిపారు.

అక్టోబర్ 28 న "అబిడ్స్‌లోని పరాస్ బాణసంచా దుకాణంలో సరైన  భద్రతా చర్యలు  తీసుకోలేదు" అనే శీర్షికతో ఈ సంఘటనను న్యూస్ మీటర్  నివేదించింది. నివేదిక ప్రకారం, టిన్ షెడ్‌తో కప్పబడిన మెజ్జనైన్ ఫ్లోర్‌తో కూడిన పరాస్ బాణసంచా షాపు లో మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని హోటల్‌కు వేగంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఐదు వాహనాలను తీసుకుని వచ్చి వేగంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నివేదికలో మరణాల గురించి  ప్రస్తావించలేదు.

పొరుగున ఉన్న రెస్టారెంట్ యాజమాన్యం ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పోలీసులు పరాస్ బాణసంచా యజమాని గురువిందర్ సింగ్ (33)పై కేసు నమోదు చేసినట్లు ది హిందూ అక్టోబర్ 29న నివేదించింది. బొగ్గులకుంటలో కార్యకలాపాలు నిర్వహించేందుకు సింగ్‌కు అవసరమైన అనుమతులు లేవని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ చారి ధృవీకరించారు.  సంఘటన స్థలం నుండి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేయడానికి సింగ్ 15 రోజుల తాత్కాలిక లైసెన్స్‌ను పొందినట్లు గుర్తించారు. హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి (DFO), T. వెంకన్న ఇచ్చిన  నివేదికలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. అయితే సమీపంలోని రెస్టారెంట్‌లోని ఇద్దరు హౌస్‌కీపింగ్ సిబ్బందికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్ కూడా ఈ సంఘటనపై నివేదికను ఇచ్చాయి. ఎటువంటి మరణాల గురించి కూడా ప్రస్తావించలేదు.

హైదరాబాద్‌లోని పరాస్ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in