
Hyderabad : 75 ఏళ్లు పైబడిన వారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ ఓ క్లెయిమ్ వైరల్ అవుతోంది.
ఫేస్‌బుక్ పోస్టులో ఈ క్లెయిమ్స్ చేసిన వ్యక్తి ఈ విధంగా వ్రాసారు, " భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్లు, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు, వారు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. వారు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయవలసిన అవసరం లేదు." (ఆర్కైవ్)
75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మినహాయింపు ఇవ్వడానికి రూల్ 31, రూల్ 31A, ఫారం 16, 24Qలలో ముఖ్యమైన మార్పులు చేసిందని ఫేస్‌బుక్ పోస్ట్ కాప్షన్ లో వ్రాశారు.
"పన్ను మినహాయింపు పొందడానికి వయస్సు 12-BBA దరఖాస్తును బ్యాంకుకు సమర్పించాలి,” అని వ్రాసి, ఈ సమాచారం సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ చెప్పిందన్నారు. ఈ పేస్‌బుక్ పోస్ట్ చివరలో ఈ సమాచారం 'సురేష్ పోటే, కార్యదర్శి - మహారాష్ట్ర సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ - ముంబై - నవీ ముంబై డివిజన్' నుండి వచ్చినట్లు సూచించారు.
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
Fact Check
ఈ ప్రచారం తప్పు అని నిర్ధారించాము.
75 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆదాయ పన్ను మినహాయింపు కలిపిస్తున్నట్లు చూపిస్తున్న సమాచారాన్ని సమర్ధించే విశ్వసనీయమైన ఏ వార్తలు దొరకలేదు.
కీవర్డ్ సెర్చ్ ద్వారా PIBFactCheck నవంబర్ 28న షేర్ చేసిన పోస్ట్ కనుగొన్నాం. ఈ పోస్ట్ క్యాప్షన్లో, "భారతదేశం స్వాతంత్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో ఒక సందేశం వ్యాపిస్తోంది... ఈ సమాచారం అవాస్తవం," అని వ్రాశారు. (ఆర్కైవ్)
“ఆదాయ పన్ను చట్టంలో సవరణలు కోరుతూ అనేక ప్రతిపాదనలు, బడ్జెట్ కసరత్తులో భాగంగా ప్రతి సంవత్సరం స్వీకరిస్తారు. అయితే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన మినహాయింపుల వంటి ప్రతిపాదనలేవి పరిశీలనలో లేవని ఇటీవల పేర్కొన్నారు,” అని ఈ కథనంలో స్పష్టం చేసారు.
Tv 9 Telugu డిసెంబర్ 3న ప్రచురించిన "Income Tax Relief: సీనియర్ సిటిజన్లకు కేంద్రం షాక్.. ఆ ప్రతిపాదన లేదని స్పష్టీకరణ," అనే కథనం కనుగొన్నాం. ఈ కథనం ప్రకారం, "సీనియర్ సిటిజన్లకు ఆదాయ పన్ను రాయితీ కల్పించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది."
ఈ కథనాల ఆధారంగా, క్లెయిమ్‌లు తప్పు అని నిర్ధారించాము.