Fact Check : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన చివరి క్షణాలు ఇవి కాదు

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది జీనత్ రెహ్మాన్ అనే మేకప్ ఆర్టిస్ట్ అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన చివరి క్షణాలు ఇవి కాదు
Published on
3 min read

కోల్‌కత్తాలోని ఆర్జికార్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ప్రజలు మరియు వివిధ ప్రజాసంఘాల నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న విచారణ చేపట్టింది. ఈ విచారణలో కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయడంలో జాప్యం చేయడం పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పై తన నిరాశను వ్యక్తం చేసింది మరియు కోల్‌కతా పోలీసులను కూడా కోర్టు విమర్శించింది, వేలాది మంది గుంపు ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలోకి ఎలా ప్రవేశించగలదని ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో, గాయపడిన స్థితిలో ఉన్న మహిళను చూపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారానికి గురైన చివరి క్షణంలో తీసుకున్న సెల్ఫీ వీడియో అంటూ అనేక మంది వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ

నిజ నిర్ధారణ:

వీడియోలో ఉన్న యువతి కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ కాదని, జీనత్ రెహ్మాన్ అనే మేకప్ ఆర్టిస్ట్ అని సౌత్ చెక్ కనుగొన్నది.

మేము వైరల్ అవుతున్న వీడియోని మరింత పరిశీలించినపుడు, 2024 ఆగస్టు 17న, X లో Mudassir Dar (مُدثِر ڈار) ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో కోల్‌కతా రేప్-హత్య బాధితురాలు తన చివరి క్షణాల్లో తీసిన సెల్ఫీ వీడియోను కోల్‌కతాలోని మేకప్ ఆర్టిస్ట్ జీనత్ రెహమాన్ రూపొందించి పోస్ట్ చేశారు అంటూ వైరల్ వీడియో పోస్ట్ చేయబడింది.

అంతేకాకుండా, 2024 ఆగస్టు 18న, Munni Thakur ఫేస్ బుక్ ఖాతా ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో జీనత్ రెహమాన్ అనే ఆర్టిస్ట్ ఈ వీడియోను రూపొందించారు అంటూ వైరల్ అవుతున్న వీడియోతో పాటు కోల్‌కతా అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన అంశాలను పోస్ట్ చేయబడింది.

అదనంగా, మేము ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ ఖాతాలలో దొరికిన ఈ నేమ్ క్లూతో సెర్చ్ చేసినప్పుడు, మాకు జీనత్ రెహమాన్ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ పేజీలు కనిపించాయి, కానీ అవి లాక్ చేయబడ్డాయి. అయితే, వారి ప్రొఫైల్‌లో కొన్ని పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రొఫైల్‌తో, ఆమె కోల్‌కతాలో మేకప్ ఆర్టిస్ట్ అని మరియు చాలా కాలం క్రితం నుండి అత్యాచారాలకు వ్యతిరేకంగా లాంఛనప్రాయ నిరసనలను సృష్టిస్తున్నారని మరియు పోస్ట్ చేస్తున్నారని మేము కనుగొన్నాము.

అంతేకాకుండా అక్టోబర్ 1, 2020 న ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో రేప్‌కి నో చెప్పండి' (రేప్‌పై అవగాహన) అనే టైటిల్ తో ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో నుదిటిపై గాయాలు మరియు ఆమె చేతితో ఆమె నోటిని గట్టిగా ఆపివేసుకున్న ఫోటోతో పాటు అత్యాచారాన్ని నిరోధించడానికి అవగాహన మరియు విద్య అత్యంత ప్రభావవంతమైన మరియు అర్థవంతమైన మార్గాలు. స్త్రీలు తమ పై అత్యాచారం జరుగుతుందని గ్రహించి, పురుషులు అత్యాచారం అంటే ఏమిటో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే బలవంతపు అత్యాచారాల సంఖ్య తగ్గుతుంది. దాడి చేసే వ్యక్తి బాధితుడిపై అవగాహన లేకపోవడాన్ని ఆహ్వానించే, బలవంతపు ప్రవర్తనగా భావించవచ్చు. (పది అత్యాచారాలలో రెండు మాత్రమే నివేదించబడ్డాయి) అంటూ మరింత సమాచారంతో పేర్కొంది.

జీనత్ రెహమాన్ ఫేస్‌బుక్ పేజీలోని ఇతర ఫోటోల పోలిక, వైరల్ వీడియోలో కనిపించిన అదే మహిళ అని మరియు కోల్‌కతా సంఘటన బాధితురాలితో సరిగ్గా సరిపోలడం లేదని నిర్ధారించాము.

అందువల్ల, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in