Fact Check : బీజేపీకి గెలిచే బలం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి జరగబోయే 2024 ఎన్నికలను ఉద్దేశించి అనలేదు

కొండా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు, ప్రస్తుతానికి బీజేపీకి బలం లేదని, నాయకులంతా కలిసి బీజేపీని బలోపేతం చేసి పార్టీని గెలిపించుకుంటాం అని ఒక ప్రెస్ మీట్ లో అన్నారు.
Fact Check : బీజేపీకి గెలిచే బలం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి జరగబోయే 2024 ఎన్నికలను ఉద్దేశించి అనలేదు
Published on
2 min read

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణాలోని చేవెళ్ల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.
అయన 16వ లోక్‌సభలో భారత రాష్ట్ర సమితి [BRS పార్టీ] నుండి తెలంగాణాలోని చేవెళ్లకు ప్రాతినిధ్యం వహించారు.

ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గెలిచే బలం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"బీజేపీకి గెలిచే బలం లేదు.. కొండా సంచలనం" అని పోస్ట్ పేర్కొంది.

ఫేస్బుక్ పోస్ట్ స్క్రీంషాట్
ఫేస్బుక్ పోస్ట్ స్క్రీంషాట్

నిజ నిర్ధారణ: 

వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదని మరియు పూర్తిగా భిన్నమైన అర్థంతో షేర్ చేయబడిందని సౌత్ చెక్ కనుగొంది.

'బీజేపీకి గెలిచే బలం లేదని.. కొండా' ఈ కీవర్డ్‌లను ఉపయోగించి మేము కీవర్డ్ సెర్చ్ చేసాము, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ యొక్క వీడియో RTV, బిగ్ టీవీ ద్వారా యూట్యూబ్‌లో కనుగొనబడింది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2023 సెప్టెంబర్ 27న ప్రెస్ మీట్ లో, తాను బీజేపీని వీడవచ్చనే ఊహాగానాలపై స్పందిస్తూ, తాను "బీజేపీలోనే ఉంటానని, మేము (నేతలు) రహస్యంగా కలవాల్సిన అవసరం లేదన్నారు. మేమంతా బహిరంగంగా కలుస్తున్నాం ఎక్కడో హోటళ్లలో కాదు. అందులో ఎలాంటి గోప్యత లేదు.

పార్టీ సభ్యులందరూ సమావేశమై పార్టీని ఎలా బలోపేతం చేయాలి మరియు రాబోయే ఎన్నికల్లో [2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో] గెలవాలనే దానిపై చర్చిస్తున్నాము. ప్రస్తుతం పార్టీకి తగినంత బలం లేదని, బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం అని గెలుస్తాం కూడా" అని అన్నారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ లో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి మాట్లాడిన దానిలో "ప్రస్తుతం పార్టీకి తగినంత బలం లేదని" ఈ మాటలను తీసుకోని, ఆ ప్రెస్ మీట్ ని ప్రసారం చేసిన బిగ్ టీవీ యూట్యూబ్ వీడియో నుండి ఒక స్క్రీంషాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది.

ఇలా చేయడం వలన, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రానున్న లోక్ సభ ఎన్నికలనుద్దేశించి బీజేపీకి గెలిచే బలం లేదు అని అన్నారని ఆ పోస్ట్ ప్రజలని తప్పుదారి పట్టిస్తుంది.

వైరల్ పోస్ట్ వెనకాల ఉన్న అసలు నిజం ఇది.

అంతేకాకుండా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీకి గెలిచే బలం లేదని, రానున్న లోక్ సభ ఎన్నికలనుద్దేశించి లేదా ఈ మధ్య కాలంలో ఆయన ఆ మాట అన్నారంటూ ఏ మీడియా కథం రాలేదు.

కాబట్టి, 'బీజేపీకి గెలిచే బలం లేదని.. కొండా సంచలనం' అంటూ వచ్చిన పోస్ట్ తప్పుదారి పట్టించేది అని నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in