Fact Check: హైవే రోడ్డుపై చిరుత కూర్చున్న  వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి  చెందినది కాదు

Fact Check: హైవే రోడ్డుపై చిరుత కూర్చున్న వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు

చిరుత రాత్రి సమయంలో హైవే రోడ్డుపై కూర్చున్న వీడియోను మనం చూడవచ్చు.
Published on

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో హైవే రోడ్డుపై చిరుత కూర్చున్నట్లు సోషల్ మీడియాలో పలువురు షేర్ చేస్తున్న వీడియో.

వీడియోని మనం చుస్తునట్టైతే, రోడ్డుపై బైక్ రైడర్లు బలవంతంగా వెనక్కి తిరగవలసి వచ్చింది మరియు పెద్ద చిరుత రోడ్డుపై కూర్చొని ఉండగా ఒక బస్సు దాని దాటిపోవడం.

ఈ వీడియో పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరియు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

ఈ వీడియో ఎంత వరకు నిజం?

నిజ నిర్ధారణ:

సౌత్‌చెక్ వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించిన తర్వాత, వాస్తవానికి ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా కర్ణాటకలో జరిగిందని కనుగొంది.

ఏప్రిల్ 16, 2023న కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లాలోని బింకాడకట్టి, అనే చిన్న గ్రామం [NH 67] హైవేపై చిరుతపులి కనిపించింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వీడియోలో మనం రోడ్డుపై చిరుతను దాటుతున్న బస్సును చూడవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే, బస్సు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై, KA అని మనం చూడవచ్చు.

నంబర్ ప్లేట్‌పై KA అని రాసి ఉన్నందున, ఈ వాహనం కర్ణాటక రాష్ట్రానికి చెందినది .

అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై అసుండి, బింకాడకట్టి, టీచర్స్ కాలనీ వాసులు సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్లకుండా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అనేక వార్తా ఛానళ్లు మరియు వార్తాపత్రికలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చిరుత కనిపించిందంటూ, ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వీడియో షేర్ అవుతోంది.

అందుకే ఆ వాదన అవాస్తవమని, వాస్తవానికి ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా కర్ణాటకలో జరిగిందని మేము నిర్ధారించాము.

logo
South Check
southcheck.in