Fact check: ఇండియా టుడే (India Today) నిర్వహించిన మూడ్ అఫ్ నేషన్ పొల్లను, ఎగ్జిట్ పోల్ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

ఈ వైరల్ పోస్టుల్లోని వీడియో ఇటీవలివి కావని న్యూస్ మీటర్ గుర్తించింది ఇండియా టుడే గ్రూప్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సంబంధించిన వీడియో అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Fact check: ఇండియా టుడే (India Today) నిర్వహించిన మూడ్ అఫ్ నేషన్ పొల్లను, ఎగ్జిట్ పోల్ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

2024  ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు కోసం  ఆంధ్రప్రదేశ్‌ మరియు  దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలింగ్ ముగియనుండడంతో ఎట్టకేలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి, ఎగ్జిట్ సర్వేలు ప్రకారం, ఎక్కువసార్లు ఎగ్జిట్ పోల్స్ మనకు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి, వీటి ద్వారా ఏ అభ్యర్థులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో ముందు సూచిస్తుంది

ఈ నేపథ్యంలో, ఆంధ్రాలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ 17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ  India Today Group ఎగ్జిట్ పోల్స్  విడుదల చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతూ ఉంది

ఇది ఇలా ఉండగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇండియా టుడే పోల్స్ పోస్టులో "ANDHRA" స్పెల్లింగ్ తప్పుగా "ADNHRA" అని ఉండటంతో ""ఇది టీడీపీ వాళ్ళు ఫేక్ చేశారు..ఇక్కడ Andhra స్పెల్లింగ్ చూడండి""  అంటూ  ఇంకో కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్ట్ ఇండియా టుడే గ్రూప్ చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అని మరియు "ADNHRA" అని అసలైన ఇండియా టుడే గ్రూప్ వీడియో లో లభించింది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు,  ఫిబ్రవరి 8, 2024 ఇండియా టుడే యూట్యూబ్ ఛానెల్‌లో Chandrababu Naidu's TDP Set to Win 17 Seats in Andhra, Predicts Mood Of The Nation అనే ఒక వీడియో ని కనుగొన్నాను. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 17 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే గ్రూప్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది అని పేర్కొంది

అంతేకాకుండా, ఈ మేము ఈ వీడియోని పరిశీలించినపుడు 0:49 సెకండ్స్కి ఇండియా టుడే యూట్యూబ్ వీడియోలో  "ADNHRA" అని స్పెల్లింగ్ తప్పుగా  ఉండడం గమనించాము మరియు ఆ వీడియో అసలైనది మరియు సవరించబడలేదు అని కనుగొన్నాము.

అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గానూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) సర్వే అంచనా వేసింది. మరోవైపు అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది  అని  అంచనా వేసింది. ఈ సర్వే డిసెంబర్ 15, 2023 మరియు జనవరి 28, 2024 మధ్య నిర్వహించబడింది.

అందువల్ల,  వైరల్ అవుతున్న వీడియో ఇండియా టుడే గ్రూప్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది  మరియు  "ADNHRA" అనే  స్పెల్లింగ్టీ  టీడీపీ వాలు ఎడిటింగ్ లో చేసిన పొరపాటు అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in