ఫ్యాక్ట్ చెక్: పాలస్తీనియన్లు భారత జెండాలను ఉపయోగించి ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

బురఖా ధరించిన పలువురు మహిళలు భారత జాతీయ జెండాలతో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెక్: పాలస్తీనియన్లు భారత జెండాలను ఉపయోగించి ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Published on
2 min read

బురఖా ధరించిన పలువురు మహిళలు భారత జాతీయ జెండాలతో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇజ్రాయెల్ దళాలు భారత త్రివర్ణ పతాకంపై కాల్పులు జరపరని అందుకే పాలస్తీనియన్లు భారత జెండాలను పట్టుకుని తమ దేశాన్ని విడిచిపెడుతున్నారని వీడియోను షేర్ చేస్తున్న అకౌంట్లలో చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావం గురించి ఒక X వినియోగదారు ఈ వీడియోను షేర్ చేశారు. “మన జాతీయ జెండా శక్తి. ఇజ్రాయెల్ భారత త్రివర్ణ పతాకంపై కాల్పులు జరపకపోవడంతో పాలస్తీనియన్లు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పాలస్తీనా నుండి బయలుదేరుతున్నారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఇప్పుడు ఈ గ్రహం మీద ఏ దేశం కూడా భారత జెండాపై కాల్పులు జరపడానికి సాహసించదు. ఇది త్రివర్ణ పతాకం, ప్రధాని మోదీ శక్తి." అంటూ పోస్టు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

South Check బృందం ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని  కనుగొంది.

భారతీయ యాత్రికులు 2023 అర్బయిన్ యాత్ర సందర్భంగా ఇరాక్‌లోని కర్బలాకు ప్రయాణిస్తున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది.

అర్బయిన్ యాత్ర అనేది ఇరాక్‌లోని కర్బాలాలో ఉన్న ఇమామ్ హుస్సేన్ కు సంబంధించిన పవిత్ర పుణ్యక్షేత్రానికి తీర్థయాత్ర. ఇరాక్‌లోని షియా ముస్లింల అతిపెద్ద వార్షిక సమావేశాలలో ఇది కూడా ఒకటి. పలు దేశాలకు చెందిన షియా ముస్లింలు ప్రతి ఏడాది వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ యాత్రకు వెళుతూ ఉంటారు.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా, భారతదేశానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 'ఫలక్ హక్' లో 2023 ఆగస్టు 31న వీడియోను పోస్ట్ చేశారు. ఇరాక్ లో షియా ముస్లింల పవిత్ర నగరమైన నజాఫ్-ఎల్-అష్రా లొకేషన్ తో ట్యాగ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. వీడియో 2023 అర్బయిన్ వాక్‌ కి సంబంధించిందని వీడియో క్యాప్షన్ తెలిపింది.

మేము సెప్టెంబరు 2023 మొదటి వారంలో ఇతర Instagram, YouTube ఖాతాల ద్వారా పోస్ట్ చేసిన వీడియోను కూడా కనుగొన్నాము. ఈ వీడియో 2023  అర్బయీన్ యాత్రకు సంబంధించిందని చూపుతుందని తేలింది.

సెప్టెంబర్ 2023 నుండి NDTV నివేదిక ప్రకారం, షియా ముస్లిం సమాజం తీర్థయాత్ర సెప్టెంబరు 6న కర్బలాలో ముగిసింది. భారతదేశం నుండి 1,00,000 మంది షియా ముస్లింలు అర్బయిన్ యాత్రలో పాల్గొనేందుకు కర్బలాకు వెళ్లారు. భారతీయ జెండాను పట్టుకున్న పిల్లవాడిని తన తండ్రి చేతుల్లో పట్టుకున్నట్లు చూపించే చిత్రం కూడా ఈ నివేదికలో ఉంది.

మేము సెప్టెంబరు 6, 2023న ఇరాక్‌లోని నజాఫ్ నుండి అర్బయిన్ వాక్‌పై NDTV వీడియో గ్రౌండ్ రిపోర్ట్‌ను చూశాము. ఈ నివేదికలో జర్నలిస్ట్ అలీ అబ్బాస్ నఖ్వీ భారతీయ జెండాలను మోసుకెళ్ళే యాత్రికులతో మాట్లాడారు. చాలా మంది ఈ యాత్రలో పాల్గొనడానికి భారతదేశం నుండి వచ్చినట్లు ధృవీకరించారు.

అంతేకాకుండా, ఇజ్రాయెల్-హమాస్ వివాదం అక్టోబర్ 7, 2023న ప్రారంభమైందని మేము ధృవీకరించాము. వైరల్ వీడియో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కంటే ముందే ఆన్ లైన్ లో ఉందని తేలింది. అంతే తప్ప పాలస్తీనియన్లు భారత జెండాలను మోస్తున్నట్లు చూపలేదని నిర్ధారిస్తున్నాము.

South Check వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఫలక్ హక్‌ను సంప్రదించింది. వారి ప్రతిస్పందన కోసం మేము ఎదురుచూస్తున్నాం.

ఇజ్రాయెల్ దాడుల నుండి పారిపోతున్న పాలస్తీనియన్లు భారత జెండాలను వాడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.  వైరల్ అవుతున్న వాదనలు నిజం కావు.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in