Fact Check : బెంగాల్ లో TMC సభ్యులు BJP కార్యకర్తలపై దాడి చేసిన పాత వీడియోను, ఇటీవల జరిగినట్లుగా షేర్ చేయబడింది

ఈ వైరల్ వీడియో పాతది మరియు రాబోయే లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేనిది.
Fact Check : బెంగాల్ లో TMC సభ్యులు BJP కార్యకర్తలపై దాడి చేసిన పాత వీడియోను, ఇటీవల జరిగినట్లుగా షేర్ చేయబడింది

ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్ సిద్ధమైంది, ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు  జరగనున్నాయి.

ఏప్రిల్ 19న ఫేజ్ 1 ఎన్నికల సందర్భంగా కూచ్‌బెహార్, అలీపుర్‌దువార్ మరియు జల్‌పైగురితో సహా మరికొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

ఈ ఎన్నికల రంగంలో కీలక పోటీదారులలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [AITC], భారతీయ జనతా పార్టీ [BJP], మరియు లెఫ్ట్ ఫ్రంట్ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లతో కూడిన సంకీర్ణం, ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కొంతమంది వ్యక్తులు ఘర్షణ పడుతున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.

"బెంగాల్ లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలను అడ్డుకొని చావగొట్టిన మమతా బెనర్జీ పార్టీ గూండాలు.
ఎక్కడ కాన రాని ఎన్నికల సంఘం, పోలీసులు, రాజ్యాంగం." అనే దావతో ఈ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ వీడియో పాతదని, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినది కాదని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ వీడియోకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు, ఆగస్టు 5, 2022న ప్రచురించబడిన " తృణమూల్ ఎమ్మెల్యే, బీజేపీ మద్దతుదారులచే వేధింపుల ఆరోపణలు, అభియోగాన్ని తిరస్కరించారు["Trinamool MLA Accused Of Harassment By BJP Supporters, He Denied Charge" ] అనే టైటిల్ తో NDTV వార్తా నివేదికను మేము కనుగొన్నాము.

నివేదిక ప్రకారం, ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడుసార్లు ఎమ్మెల్యే అయిన అసిత్ మజుందార్ ఆరోపణలను ఖండించారు, టిఎంసిపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలను తాను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు.

అలాగే TV9 భారతవర్ష్ వార్తా నివేదిక ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని ఖాదీనామోర్, చింసూరాలో ఈ సంఘటన జరిగినట్లు నివేదించబడింది.

మేము మా శోధనను కొనసాగిస్తున్నప్పుడు, 6వ ఆగస్టు 2022 న ఈ వైరల్ వీడియోను నివేదిస్తూ X పై News18 యొక్క అధికారిక హ్యాండిల్ ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. "పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో వీధిలో యుద్ధం, బిజెపి-టిఎంసి కార్యకర్తల మధ్య ఘర్షణ" అని News18 పోస్ట్ పేర్కొంది.

అందుకే, BJP - TMC ఘర్షణకు సంబంధించిన వైరల్ వీడియో పాతదని, దానికి 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధం లేదని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in