ఏపీ అసెంబ్లీలో 175 సీట్లకు గాను 164 సీట్లు గెలుచుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు, పదేళ్లకి పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తొలిసారిగా పిఠాపురం నుంచి భారీ విజయం సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు.
ఈ నేపథ్యంలో, అసెంబ్లీలో స్పీకర్ ప్రసంగిస్తున్నప్పుడు నిద్రపోతున్న పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ కార్డ్ రూపంలో ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు సవరించబడింది అని సౌత్ చెక్ కనుగొంది
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను సోదిచడానికి, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలను చూశాం, శాసనసభ సమావేశాల్లో తొలి రోజు మిగిలిపోయిన ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభకు స్వల్ప విరామం ప్రకటించారు తిరిగి సభప్రారంభంకాగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టగా స్పీకర్ పదవికి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే అయన్న పాత్రుడును సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసనసభా పక్ష నేతలు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చో పెట్టటంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారు
అయన్న పాత్రుడు స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరింఞ్చి మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కంటిరెప్పలు వేసినప్పుడు ఆ వీడియో క్లిప్ నుండి స్క్రీన్ షాట్ తీయబడింది మరియు అతను నిద్రపోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మేము నిర్ధారించాము
అంతేకాకుండా,మేము వైరల్ పోస్ట్ యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, X జూన్ 25, 2024 న Political Accountability.. ఖాతాలో ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ప్రజలు ఛీ కొట్టిన.. మారని వైసీపీ బుద్ది..పవన్ కళ్యాణ్ పై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం..సరిగ్గా పవన్ కళ్యాణ్ కళ్ళు మోసిన టైమ్ లో Screenshot తీసి అసెంబ్లీ లో పడుకుంటున్నారు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అని పేర్కొంది
అదనంగా, X జూన్ 25, 2024 న Telugu Desam Party ఖాతాలో మరో పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు, ఛానెల్స్ ఇవి. "Yuvagalam" అనే youtube ఛానల్, టిడిపికి అనుకూలం అనే విధంగా ఐప్యాక్ వాళ్లతో మొదలు పెట్టించారు. గతంలో చంద్రబాబు గారిని తిడుతూ ఈ చానెల్‌లో వీడియోలు పెట్టారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ గారిపై ఫేక్ వీడియోలు వేసి, అది టిడిపి వేసింది అనే విధంగా, జనసేనకి అనుకూలం అనే విధంగా మరో ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసారు. రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి, ఒక పెద్ద కుట్రకు తెర తీసారు.
"Yuvagalam" అనే Youtube ఛానల్‌తో టిడిపికి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల ముందు వరకు, ఈ ఛానెల్‌లో టిడిపికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు.
ఇలా పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినిమా ఫాన్స్ మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి, ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కడికే ఉంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలని నమ్మవద్దని, మనవి చేస్తున్నాము. ఇలాంటి వాటిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం నుంచి సైకోగాళ్ళని శాశ్వతంగా తరిమేసే దాకా, టిడిపి-జనసేన మైత్రి కొనసాగుతూనే ఉంటుంది అని పేర్కొంది
అందువల్ల, అసెంబ్లీలో నిద్రపోతున్న పవన్ కళ్యాణ్ అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.