2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటందుకు సూపర్ 6 పథకాలు ప్రధాన కారణం.
ఈ నేపథ్యంలో,టిడిపి కూటమి ప్రభుత్వం సూపర్-6 పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజల తరపున ప్రశ్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మరోవైపు పెన్షన్ పెంచడం పై గొప్పలు చెప్పుకున్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీవాట్లు అనే వాదనతో మరో పోస్ట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
ఈ దావా తప్పు అని మరియు తప్పుదారి పట్టించేదని సౌత్ చెక్ కనుగొంది.
మేము వైరల్ వీడియోకు సంబంధించి కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు, ఒక వార్తా నివేదికను కనుగొన్నాము, జూలై 14, 2023 న TV5 News యూట్యూబ్ ఛానెల్‌లో నువ్వెవడివి జగన్! | Pawan Kalyan Fires on YSRCP Govt & YS Jagan | TV5 News అనే టైటిల్ తో ఒక వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా దేశంలో నేను బతకాలంటే నేను ఎవరికి టాక్స్ కట్టాలి..అరే ఇది నా జన్మ ఇది.... ఇది నా నేల ఇది....రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ఇది ఏ జగన్ నువ్వు నువ్వెవడివి.....నీ మంత్రులు ఎవరు, నీ ఎమ్మెల్యేలు ఎవరు, నీ పార్టీ ఏంటీ..తామందరం భారతీయులం, ఆంధ్రులమని....నీవు ఎవరు చెప్పడానికి....మాకు అంబేద్కర్ కల్పించిన హక్కుంది...నీవు ఎవరు చెప్పడానికి మాకు....ఫీజు రీయింబర్స్ మెంట్ కావాలంటే నిన్ను అడగాలా...అంటూ ఆరోపించారు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలో "జగన్ నువ్వు నువ్వెవడివి" అన పదాన్ని డిజిటల్‌గా ఎడిట్ చేసి, చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీవాట్లు అనే వాదనతో తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.
అదనంగా, వైరల్ అవుతున్న వీడియో మరియు జూలై 2023 లో జరిగిన బహిరంగ సభ సంబంధించిన వీడియో ఒకటి కాగా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అందువల్ల, వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు 2023 లో జరిగిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సంబంధించినది అని సౌత్ చెక్ కనుగొంది.