Fact check: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారాన్ని రాహుల్ గాంధీ చూస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వైరల్ అవుతున్న వీడియో పాతది మరియు సవరించబడింది
Fact check: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారాన్ని రాహుల్ గాంధీ చూస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

2024, జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారీ వేడుకలో భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ భారత ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ యొక్క BJP నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్అ లయన్స్ సార్వత్రిక ఎన్నికల్లో 293 స్థానాలతో విజయం సాధించింది

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కారులో కూర్చుని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం వీడియోను కారులో స్క్రీన్‌పై చూస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు సవరించబడింది అని న్యూస్‌మీటర్ కనుగొంది

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధిస్తున్నప్పుడు, ఏప్రిల్ 17, 2024 లో rahulgandhi ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో भारत की सोच में, भारत की खोज में! కాప్షన్ తో ఒక వీడియో కనుగొన్నాను ఆ వీడియోలో గాంధీ కారులోని టీవీ స్క్రీన్‌పై ఎలాంటి వీడియో క్లిప్ కనిపించలేదు అని మేము కనుగొన్నాము.

అంతేకాకుండా, ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 19, 2024న జరిగిన లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు ముందు సంబంధించినది మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 9, 2024 న జరిగింది కాబట్టి రెండు తేదీలు వేర్వేరుగా ఉన్నాయని మేము గమనించాము

అయితే వేదికపై ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న క్లిప్‌ను గాంధీ వీడియోకు జోడించి రాహుల్ గాంధీ కారులో కూర్చుని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం వీడియోను చూస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేబడతుంది అని కనుగొన్నాము.

అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో లో రాహుల్ గాంధీ కారులో స్క్రీన్‌పై నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం వీడియోను చూస్తున్నారు అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in