ఫ్యాక్ట్ చెక్: బ్రిక్స్ సమ్మిట్‌లో ప్లే అయిన రష్యన్ మెలోడీ విశాల్ భరద్వాజ్ 'డార్లింగ్' నుండి కాపీ చేయలేదు

రష్యాలోని కజాన్‌లో అక్టోబర్ 22-24 వరకు 2024 బ్రిక్స్ సమ్మిట్ నిర్వహించారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వస్తాయి. ఈ సంవత్సరం జనవరి 1న, BRICS నాలుగు కొత్త సభ్యులను చేర్చుకుంది.
ఫ్యాక్ట్ చెక్: బ్రిక్స్ సమ్మిట్‌లో ప్లే అయిన రష్యన్ మెలోడీ విశాల్ భరద్వాజ్ 'డార్లింగ్' నుండి కాపీ చేయలేదు
Published on
2 min read

రష్యాలోని కజాన్‌లో అక్టోబర్ 22-24 వరకు 2024 బ్రిక్స్ సమ్మిట్ నిర్వహించారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వస్తాయి. ఈ సంవత్సరం జనవరి 1న, BRICS నాలుగు కొత్త సభ్యులను చేర్చుకుంది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్ లో భాగమయ్యాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు నాలుగింట ఒక వంతుకు బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు.

అధికారిక బ్రిక్స్ న్యూస్ ఎక్స్ హ్యాండిల్ షేర్ చేసిన వీడియోలో దేశాధినేతల విందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో సహా ప్రపంచ నాయకులు పాల్గొన్నారు. వారందరూ కచేరీని ఆస్వాదిస్తున్నట్లు చూడొచ్చు.

2011లో ప్రియాంక చోప్రా జోనాస్ నటించిన బాలీవుడ్ చిత్రం 'సాత్ ఖూన్ మాఫ్‌' లోని ఓ సాంగ్ ప్లే చేశారని ఆ వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు తెలిపారు. ఈ సాంగ్ ను సినిమాలో విశాల్ భరద్వాజ్ కంపోజ్  చేశారు. "డార్లింగ్ ఆంఖోన్ సే ఆంఖేన్ చార్ కర్నే దో" సాంగ్ అప్పట్లో భారీ హిట్. ఆ హిట్ సాంగ్ కు సంబంధించిన పాట ట్యూన్ ను బ్రిక్స్ సదస్సులో ప్లే చేశారని ఆరోపించారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. "డార్లింగ్..." సాంగ్ ట్రాక్ రష్యన్ రెడ్ ఆర్మీ గాయక బృందం నుండి ప్రేరణ పొందారు. కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని సౌత్ చెక్ కనుగొంది.

మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. డిసెంబర్ 29, 2010మా “రష్యన్ మెలోడీ నుండి ప్రేరణ పొందిన 7 ఖూన్ మాఫ్ ట్రాక్?” అనే హిందుస్థాన్ టైమ్స్ నివేదికను కనుగొన్నాము. ఆ నివేదికలో భరద్వాజ్‌ ను సంప్రదించిన ఒక మూలం ఆయన రష్యన్ రెడ్ ఆర్మీ కోయిర్ జానపద పాట కళింకా నుండి "డార్లింగ్ ఆంఖోన్ సే ఆంఖీన్ చార్ కర్నే దో" సాంగ్ కు ప్రేరణ పొందారని ధృవీకరించింది.

ఇది రష్యాలోని అత్యంత ప్రసిద్ధ జానపద పాటలలో ఒకటి అని వివరించారు. 'ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఓ పాత్ర చేసింది అది సుసన్నా, అలెగ్జాండర్ డయాచెంకో పోషించిన వ్రోన్స్కీ అనే రష్యన్‌ని వివాహం చేసుకునే సన్నివేశాలకు సరిగ్గా సరిపోతుంది.' అని తెలిపారు. ఈ పాటను రికార్డ్ చేయడానికి భరద్వాజ్ నలుగురు రష్యన్ గాయకులను తీసుకువచ్చారని కూడా నివేదికలో తెలిపారు.

రష్యాలోని కజాన్‌లో జరిగిన అత్యున్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 22, మంగళవారం నాడు బ్రిక్స్ ప్రతినిధులకు చెందిన నాయకులు గాలా కచేరీకి హాజరైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న ప్రచురించిన News18 నివేదికను కూడా మేము కనుగొన్నాము.

1860లో ఇవాన్ లారియోనోవ్ స్వరపరిచిన ఐకానిక్ రష్యన్ జానపద పాట కాళింకా ప్రదర్శనను నాయకులు ఆస్వాదించారని నివేదిక పేర్కొంది. టెట్రిస్, పేడే 2 వంటి వీడియో గేమ్‌లతో సహా వివిధ మాధ్యమాల్లో ఈ ట్యూన్ ప్రపంచ సాంస్కృతిక చిహ్నంగా మారింది.

7 ఖూన్ మాఫ్‌లోని బాలీవుడ్ పాట "డార్లింగ్"తో సహా వివిధ శైలులలో "కళింకా" ను ప్రేరణగా తీసుకుని మ్యూజిక్ ను కంపోజ్ చేశారు.

7 ఖూన్ మాఫ్ సినిమా గురించి:

7 ఖూన్ మాఫ్ సినిమా రస్కిన్ బాండ్ రచించిన కథ "సుసన్నాస్ సెవెన్ హస్బెండ్స్" ఆధారంగా తెరకెక్కించారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ సినిమా 2011లో విడుదలైంది. కథ ఓ మహిళ చుట్టూ నడుస్తుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రను ప్రియాంక చోప్రా పోషించింది. ఆమె ఏడుగురు వేర్వేరు పురుషులను వివాహం చేసుకుంటుంది, వారికి చావులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారన్నది సినిమాలో చూడాలి.

గుల్జార్ సాహిత్యంతో భరద్వాజ్ స్వరపరిచిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందాయి. సౌండ్‌ట్రాక్ లోని సూపర్ హిట్ సాంగ్ "డార్లింగ్ ఆంఖోన్ సే ఆంఖేన్ చార్ కర్నే దో"  రష్యన్ జానపద పాట "కాళింకా" నుండి ప్రేరణ పొందింది. విభిన్న సంగీత శైలుల కలయిక ఈ పాట.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in