

Hyderabad: తరగతి గదిలో అబ్బాయిలు, హిజాబ్ ధరించిన అమ్మాయిలు వేర్వేరుగా కూర్చోడం చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫేస్‌బుక్‌లో వీడియోను షేర్ చేస్తూ, ఇలా రాశారు, "ఇది పాక్ లేదా బంగ్లాదేశ్ లో కాదు ..ఇది మన దేశంలో ని కేరళ రాష్ట్రంలో .." (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టు ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
వీడియోలో ఉన్న విద్య సంస్థ తాలిబన్ శైలిలో ఉన్నట్లు క్లెయిమ్ చూస్తున్న పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
"కేరళలోని తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య గోడ, వీడియో వైరల్" అనే శీర్షికతో ఆసియనెట్ హిందీ వెబ్సైటు ఈ వీడియోలోని చిత్రం షేర్ చేసింది.
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వైరల్ వీడియో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రైవేట్ కళాశాలను చూపిస్తుంది.
వైరల్ వీడియో కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి, అక్టోబర్ 10న 'Aamer Srs' అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన అదే ఫుటేజ్‌ను కనుగొన్నాం. పోస్ట్ క్యాప్షన్ "గైడెన్స్ లెక్చర్" అని ఉంది. మరో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ 'Mukhtar Sirs' కూడా పోస్ట్‌లో ట్యాగ్ చేయబడ్డారు.
'Aamer Srs' ఇంస్టాగ్రామ్ అకౌంట్ బయోలో 'మోస్ అకాడమీ నాందేడ్ డైరెక్టర్' అని రాశారు. మోస్ అకాడమీ మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న ఒక ప్రైవేట్ విద్యా సంస్థ. అకౌంట్లో ఇదే క్లాస్‌రూమ్‌ని చూపిస్తున్న పలు వీడియోలో అప్లోడ్ చేయబడినట్లు గుర్తించాం. సెప్టెంబర్ 26, 27 తారీకులలో ఇవి షేర్ చేయబడ్డాయి.
'Mukhtar Sirs' ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ క్లాస్‌రూమ్‌ని చూపిస్తున్న పలు ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఆగష్టు 28న అప్లోడ్ చేయబడిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.
అడ్మిషన్ కు సంబంధించి షేర్ చేయబడిన పోస్టర్ల నుండి, ఈ సంస్థను ఇద్దరు వ్యక్తులు, అమీర్, ముక్తార్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ సంస్థ మహారాష్ట్రలోని నాందేడ్ లోని దెగ్లుర్నాగ పోలీస్ చౌక్ సమీపంలో ఉందని గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి ద్రువీకరించాం.
ఈ విద్య సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదని గమనించాం. అయితే యూట్యూబ్‌లో సంస్థ గురించిన సమాచారం ఉంది. 10, 12 తరగతులకు ట్యూషన్, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ అందించే ప్రైవేట్ సంస్థ అని తేలింది.
కాబట్టి వైరల్ వీడియో కేరళలో ఉన్న విద్య సంస్థను చూపించడం లేదు, ఇది మహారాష్ట్రలోని నాందేడులో ఉంది. సౌత్ చెక్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.