Fact Check: కూటమి ప్రభుత్వం ప్రకాశం బ్యారేజ్ కి పసుపు రంగును వేసింది అంటూ వచ్చిన పోస్ట్ లో ఎలాంటి వాస్తవం లేదు

ఈ దావా తప్పు మరియు వైరల్ అవుతున్న ఫోటో చాలా ఏళ్ల నాటిది అని సౌత్ చెక్ కనుగొంది.
Fact Check: కూటమి ప్రభుత్వం ప్రకాశం బ్యారేజ్ కి పసుపు రంగును వేసింది అంటూ వచ్చిన పోస్ట్ లో ఎలాంటి వాస్తవం లేదు
Published on
2 min read

గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు మరియు వెంటనే YCP జెండా రంగులు తొలగించాలి అని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారం రోజుల్లో రంగులను తొలగించాలని ఆదేశించడంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అని మనకు తెలిసిందే.

ఈ నేపథ్యంలో, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం టీడీపీ జెండాకు సంబంధించిన పసుపు రంగును ప్రకాశం బ్యారేజ్ కి వేసింది అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ 

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న ఫోటో చాలా సంవత్సరాల క్రితం నుండి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించినప్పుడు, 2016 జులై 12న AP7am.com ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వివిధ రైల్వే స్టేషన్లను సందర్శించి కృష్ణా పుష్కరాల పనులను సమీక్షించారు అంటూ వైరల్ అవుతున్న ఫోటోతో పాటు నివేదించింది ఒక కథనాన్ని మేము కనుకున్నాము.

అంతేకాకుండా, 2015 నవంబర్ 26న Amaravati Voice ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో మీరు విజయవాడలోని ఆకర్షణలను అన్వేషిస్తున్నట్లయితే, మీ ప్రయాణంలో చేర్చుకోవడానికి మీరు ఎప్పటికీ కోల్పోకూడని ప్రదేశం ప్రకాశం బ్యారేజీ. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం దాదాపు 1223 మీటర్లు కృష్ణా నది మీదుగా ఉంది. ఈ బ్యారేజీ గొప్పతనం ఏమిటంటే, ఈ నది విజయవాడ నగరం ఉన్న కృష్ణా జిల్లాను సమీపంలోని గుంటూరు జిల్లాతో కలుపుతుంది. కూడా, బ్యారేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెండు జిల్లాల మధ్య రహదారి వంతెనగా పనిచేస్తుంది అంటూ వైరల్ అవుతున్న ఫోటోతో పాటు నివేదించింది మరో కథనాన్ని మేము కనుకున్నాము.

X లో మార్చి 2, 2016న Amaravati Voice ఖాతా ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము, అందులో ప్రకాశం బ్యారేజ్ - విజయవాడ ఐకాన్ గురించి తెలుసుకోండి అంటూ వైరల్ అవుతున్న ఫోటోతో పాటు పోస్ట్ చేయబడింది.

అదనంగా, ప్రకాశం బ్యారేజ్ యొక్క ప్రస్తుత రంగు ఏమిటో తెలుసుకోవడానికి మేము ప్రయత్నించినప్పుడు, జూలై 21, 2024న The Hindu ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో ఆదివారం(జూలై 21, 2024) విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్ల దృశ్యం అంటూ తాజా ఫోటోతో పాటు నివేదిక ప్రచురించబడింది.

అందువల్ల, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in