నిజమెంత: రెండు సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై బుడ్డ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు

గణతంత్ర దినోత్సవం రోజున జేఎస్పీ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల సీట్లు ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుడ్డ వెంకన్న విమర్శిస్తూ, హెచ్చరిస్తూ పోస్ట్ రాశారు.
నిజమెంత: రెండు సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై బుడ్డ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు
Published on
1 min read

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై, "పవన్ కళ్యాణ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాజోలు, రాజానగరం నియోజకవర్గాల సీట్లు ప్రకటించడం చూస్తే.... ఆయనకవి సీట్లు అనుకున్నాడో.. స్వీట్లు అనుకున్నాడో అర్థం కావడం లేదు... చంద్రబాబుగారి మీద పోటీ పడి ఇలా పౌడర్ వేసుకున్నోడిలా ప్రవర్తించడం తగదు... పొత్తుకి భంగం వాటిల్లే ఆస్కారం ఉంది అని గ్రహిస్తే మంచిది,లేదా నష్టపోయేది పవనే..." అని టీడీపీ నేత బుడ్డ వెంకన్న అన్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫుల్ వైరల్ అయి టీడీపీ-జేఎస్పీ పొత్తుపై పెను ప్రభావం చూపింది.

బుడ్డ వెంకన్న నిజంగా ఇలా పోస్ట్ చేసారా? ఇది ఎంతవరకు నిజం? రండి తెలుసుకుందాం.

నిజ నిర్ధారణ:

సౌత్ చెక్ వైరల్ పోస్ట్‌ను లోతుగా త్రవ్వడంతో, వార్తను పోస్ట్ చేసిన ఖాతా అస్సలు ఉనికిలో లేదని మాకు తెలిసింది.

ఫేస్‌బుక్‌లో బుడ్డ వెంకన్న పేరు మీద ఎడిట్ చేసి పెట్టిన పోస్ట్ చూశాం. ఇదే పోస్ట్ అన్ని సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

పైగా బుడ్డ వెంకన్న యొక్క అసలు ఖాతా మాకు కనిపించింది, అందులో అతను ఫేక్ వార్తలను షేర్ చేసే వ్యక్తులు ఉన్నారని మరియు దానికి తాను భయపడనని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. వైరల్ అవుతున్న ఎడిట్ చేసిన పోస్ట్‌తో పాటు దాని వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు రాసిన ఫిర్యాదు లేఖను కూడా జత చేశాడు.

అందుకే పవన్ కళ్యాణ్ సీట్లు ప్రకటించడంపై బుడ్డ వేకన్న ఏమీ వ్యాఖ్యానించలేదని తేల్చవచ్చు. [ NTV వీడియో లింక్ ]

వైరల్ అవుతున్న పోస్ట్ ఎడిట్ చేయబడింది మరియు పూర్తిగా ఫేక్.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in