ఫ్యాక్ట్ చెక్: అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర చెప్పలేదు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలిచింది.
ఫ్యాక్ట్ చెక్: అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర చెప్పలేదు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని  సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలిచింది.

అయితే ఈ విగ్రహాన్ని కూల్చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు వ్యాఖ్యలు చేశారని వే2న్యూస్ మీడియా సంస్థకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉంది. విజయవాడలో కొత్తగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేస్తామని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ అన్నట్లు మొబైల్‌ న్యూస్‌ యాప్‌ వే2న్యూస్‌కు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌ వైరల్ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామంటూ ఆయన తెలిపారు.

ఫేస్ బుక్ లో "చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తాం:- నరేంద్ర కుమార్" అంటూ పోస్టులు పెట్టారు.

చాలా మంది X, ఫేస్ బుక్ వినియోగదారులు ఇదే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.

జనవరి 19వ తేదీన విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించిన నేపథ్యంలో ఈ పోస్టులు వచ్చాయి.

ఫ్యాక్ట్ చెకింగ్:

సౌత్ చెక్ ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. Way2News సంస్థకు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ లో వైరల్ అవుతున్న కథనాన్ని తమ సంస్థ ప్రచురించలేదని పేర్కొంటూ ఒక పోస్ట్‌ని పెట్టారు. కొంతమంది వ్యక్తులు తమ లోగోను ఉపయోగించారని, వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ధూళిపాళ నరేంద్ర కుమార్ ఈ వైరల్ పోస్టును ఖండించారని ABN Andhra Jyothy లో ఒక కథనం కూడా వచ్చింది. సోషల్ మీడియాలో వైసీపీ (YCP) చేస్తున్న అసత్య ప్రచారాలపై టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని.. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారని ఆ మీడియా సంస్థలో కథనాన్ని చూశాం.

విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేస్తామని తన పేరుతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు జనవరి 22న నరేంద్రకుమార్‌ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. తనపై వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పోస్ట్‌లో ఆరోపించారు.

"రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీ.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేతలపై, ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపై చర్యలు తీసుకొని.. ఈ కుట్రలో పాత్రధారులను బయటపెట్టాలని కోరడం జరిగింది.
పోలీసులు పట్టించుకోకపోయినా ఫేక్ ప్రచారం చేస్తున్నవారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు.
న్యాయస్థానంలో పోరాడైనా సరే ఆ పేటీఎం బ్యాచ్ ను ప్రజల ఎదుట నిలబెడతాం..!
కోనసీమలో మాదిరిగానే కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టి  పెట్టాలనే వైసీపీ కుట్రలను తిప్పికొడతాం." అంటూ ధూళిపాళ్ల నరేంద్ర పోస్టు పెట్టారు.

విజయవాడలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేస్తానని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ చెప్పలేదని మేము ధృవీకరిస్తున్నాం.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in