Fact Check: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద మోసగాడు అంటూ వచ్చిన వార్త నిజం కాదు

Fact Check: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద మోసగాడు అంటూ వచ్చిన వార్త నిజం కాదు

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి దాసరి ఉష ఇలాంటి విమర్శలేవీ చేయలేదు, అందులో వార్త ఫేక్ అని సౌత్ చెక్ కనుగొంది.
Published on

మాజీ IPS అధికారి రేపల్లె శివ ప్రవీణ్ కుమార్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ మరియు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. తన ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాజకీయ దృశ్యంలో దళితులు మరియు బహుజనుల సాధికారత కోసం వాదిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ బ్యానర్‌పై పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూశారు.ఆ తర్వాత అతను మార్చి 16, 2024 న BSPకి రాజీనామా  చేసి, మార్చి 18, 2024న BRS అధ్యక్షుడు K. చంద్రశేఖర్ రావు సమక్షంలో అధికారికంగా BRS లో చేరారు 

ఈ నేపథ్యంలో, BRS నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై అదే పార్టీకి చెందిన దాసరి ఉష ""ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద మోసగాడు తాను బీఎస్పీ టిక్కెట్లు అమ్ముకుంటూ.బడుగు బలహీన వర్గాల పిల్లల చదువులు పాడు చేసి సిర్పూర్ ఎన్నికల్లో తన వెంట తిప్పుకున్నాడు.మరియు అసెంబ్లీ ఎన్నికల కోసం నా దగ్గర 20 కోట్లు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే స్పందించడం లేదు.

నేను తన బినామీని అంటూ ప్రచారం చేసుకుంటూ నాగర్ కర్నూల్ లో పంచడానికి మరో 10 కోట్లు అడుగుతు ఇవ్వకపోతే అంతు చేస్తామని బెదిరిస్తున్నారు"" అంటూ ఒక కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది,

నిజ నిర్ధారణ :

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఆ పార్టీకి చెందిన దాసరి ఉష విమర్శలు చేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం షేర్ చేయబడుతున్న క్లిప్ డిజిటల్‌గా రూపొందించబడింది

వైరల్ అయిన ఫోటో గురించి X లో మరింత శోధించగా, ఈ వార్త ఫేక్ అని, ఎవరు ఈ వార్తను నమ్మవద్దని ఆమె X ద్వారా స్పష్టం చేసింది.

అంతేకాకుండా, మేము వైరల్ ఇమేజ్ గురించి వివరాలు కనుగొనడానికి 6 మే 2024 ‘నా తెలంగాణ’ డిజిటల్ వార్తాపత్రిక శోధించినప్పుడు ర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మరియు ఉషకు సంబంధించి మాకు ఎలాంటి వార్త కనిపించలేదు మరియు ఆ తరహా వార్తలు ఏమీ లేవు

అందువల్ల, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి దాసరి ఉష ఇలాంటి విమర్శలు చేశారు అంటూ వచ్చిన వార్త క్లిప్ డిజిటల్‌గా  ఎడిట్ చేసి తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.

logo
South Check
southcheck.in