

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద పులి దాడి జరిగినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.
వీడియోలో ఒక వ్యక్తి ఇంటి ముందు కూర్చొని ఉంటాడు, కొద్ది సేపట్లో పులి వచ్చి అతనిపై దాడి చేసి లాగి తీసుకెళ్లినట్లు కనిపిస్తుంది.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను “రైతు పై పులి దాడి ..చనిపోయిన రైతు....మహారాష్ట్ర సరిహద్దు గ్రామములో ఘటన” అనే శీర్షికతో పోస్ట్ చేశారు.(Archive)
సౌత్ చెక్ పరిశీలనలో ఈ వీడియో తప్పుడు అని తేలింది.
ఇది అసలు సీసీటీవీ వీడియో కాదు - AI సాయంతో సృష్టించబడిన కృత్రిమ వీడియో.
ముందుగా, గూగుల్ కీవర్డ్ సెర్చ్ ద్వారా పరిశీలించగా,
బ్రహ్మపురి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద పులి దాడి జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయ వార్తా నివేదికలు లేవు.
దీంతో, వీడియో నిజమైన సంఘటనకాదని అనుమానం బలపడింది.
వీడియోను గమనిస్తే, కొన్ని స్పష్టమైన లోపాలు కనిపిస్తాయి —
వ్యక్తి కదలికలు సహజంగా లేవు, యానిమేషన్ లా రోబోటిక్‌గా కనిపిస్తున్నాయి.
పులి దాడి చేసిన తర్వాత, వ్యక్తి పులితోపాటు పరుగెత్తినట్లు కనిపించడం సహజ ప్రవర్తన కాదు.
ఒక ఫ్రేమ్‌లో అతని ఎడమ చేతి స్లీవ్ పూర్తి తెల్లగా ఉండగా, తర్వాతి ఫ్రేమ్‌లో స్లీవ్ సగం మాత్రమే ఉంది, ఇది AI జనరేట్‌డ్ వీడియోలలో సాధారణంగా కనిపించే రేండరింగ్ లోపం.
ఇంకా స్పష్టత కోసం, న్యూస్‌మీటర్ ఈ వీడియోను Hive Moderation అనే AI కంటెంట్ గుర్తింపు సాధనం ద్వారా పరిశీలించింది.
ఈ టూల్ ప్రకారం, వీడియోలో 98.1% AI సృష్టించిన అంశాలు ఉన్నట్లు నిర్ధారించింది.
బ్రహ్మపురి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద పులి దాడి జరిగిందని చెబుతున్న వీడియో నిజం కాదు.
ఇది కృత్రిమ మేధ (AI) సాయంతో తయారు చేసిన వీడియో మాత్రమే.
అందువల్ల, ఈ దావా తప్పు.