Fact Check : ప్రేమించలేదని విద్యార్థిని హతమార్చిన స్థానిక YSRCP నాయకుడి కొడుకు వంశీ రెడ్డి అంటూ వచ్చిన దావా నిజం కాదు

ప్రచారంలో ఉన్న వీడియో కర్ణాటకలోని హుబ్బళ్లి హత్య కేసుకు చెందినది.
Fact Check : ప్రేమించలేదని విద్యార్థిని హతమార్చిన స్థానిక YSRCP నాయకుడి కొడుకు వంశీ రెడ్డి అంటూ వచ్చిన దావా నిజం కాదు

దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, గురువారం తన కళాశాల క్యాంపస్‌లో ఒక విద్యార్థిని కత్తితో పొడిచి చంపబడింది. ఘటనా స్థలం నుంచి పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో 'ప్రేమించలేదని విద్యార్థిని హతమార్చిన వంశీ రెడ్డి..
స్థానిక వైస్సార్సీపీ నాయకుడు కొడుకుగా గుర్తింపు.
కొవ్వెక్కి, ఆడపిల్లను పాశవికంగా కాలేజ్ లో చంపితే కేసు బయటకు రాకుండా రాజీ కోసం ప్రయత్నిస్తున్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే' అనే దావాతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ :

సౌత్ చెక్ ఈ దావా తప్పు మరియు తప్పుదారి పట్టించేదని కనుగొంది.

మేము ఈ దావా కి సంబంధించి కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు, ఈ సంఘటనను నివేదించిన వార్తా నివేదికలను కనుగొన్నాము.ఇక్కడ ఇక్కడ

అయితే '23 ఏళ్ల మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) విద్యార్థిని నేహా హిరేమత్‌పై గురువారం హుబ్బళ్లిలోని బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో ఫయాజ్ దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజీల్లో ఫయాజ్ పారిపోయే ముందు నేహాపై పలుమార్లు కత్తితో పొడిచినట్లు కనిపించింది. ఫయాజ్ చేసిన పలు కత్తిపోట్లతో మహిళ చనిపోయిందని, అనంతరం ఫయాజ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.' అంటూ indiatoday.in వార్తా నివేదిక పేర్కొంది.

సంచలనం రేపిన హుబ్బళ్లి హత్య ఘటన వార్త ఛానెళ్ల ప్రసార వీడియోలు. ఇక్కడ ఇక్కడ.

బాధితురాలి తండ్రి నిరంజన్ హిరేమత్ మాట్లాడుతూ నిందుతుడు ఫయాజ్ కుటుంబానికి తెలిసినవాడని, నేహాను వెంబడించకుండా అడ్డుకునేందుకు కూడా వారు ప్రయత్నించారని తెలిపారు.

నేహాకు ఫయాజ్ అంటే ఇష్టం లేదని, సాధారణంగా వీటన్నింటికీ దూరంగా ఉండేదని. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారని, అతడితో ఎలాంటి సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పి అతని ప్రతిపాదనను తిరస్కరించింది.

నిందితుడి ప్రేమ ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించడమే హత్యకు కారణమని ఆయన పేర్కొన్నారు.

అరెస్టయిన ఫయాజ్ ఏ హుబ్బల్లి హత్య కేసులో నిందితుడు, కాబట్టి మేము పై వాదన తప్పు మరియు తప్పుదారి పట్టించేదిగా నిర్ధారించాము. 

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in