ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌లోని దుర్గా విగ్రహం ధ్వంసమైన ఘటనను మతపరమైన కోణంతో ప్రచారం చేస్తున్నారు

హైదరాబాద్: విజయదశమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవల, హైదరాబాద్‌లోని దుర్గమ్మ విగ్రహాన్ని ముస్లింలు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ చూపించే వీడియో వైరల్‌గా మారింది.
ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌లోని దుర్గా విగ్రహం ధ్వంసమైన ఘటనను మతపరమైన కోణంతో ప్రచారం చేస్తున్నారు
Published on
2 min read

హైదరాబాద్: విజయదశమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవల, హైదరాబాద్‌లోని దుర్గమ్మ విగ్రహాన్ని ముస్లింలు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ చూపించే వీడియో వైరల్‌గా మారింది.

ఇదేమీ పాకిస్థాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు.. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ పలువురు పోస్టులు పెట్టారు. ముస్లింలు హైదరాబాద్ లో దుర్గా మాత విగ్రహాన్ని ధ్వంసం చేశారనే వాదనతో వీడియోను షేర్ చేశారు.

1:36 నిమిషాల నిడివి గల వీడియోలో, ఒక మండపం లోపల ధ్వంసమైన దుర్గా విగ్రహాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు ఆ వీడియో ఉంది. అక్కడ విగ్రహం కుడి చేయి విరిగిపోయి కనిపించింది. అంతేకాకుండా విగ్రహం పాదాల వద్ద నైవేద్యాలు చెల్లాచెదురుగా కనిపిస్తాయి.

వీడియోను ఇక్కడ, ఇక్కడ భాగస్వామ్యం చేయడాన్ని చూడవచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని సౌత్ చెక్ ధృవీకరించింది.

ఈ విధ్వంసానికి సంబంధించి ఎలాంటి మతపరమైన కోణం లేదని పోలీసులు నిర్ధారించారు.

వైరల్ విజువల్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Telangana Today లో అక్టోబర్ 11, 2024న ‘Hyderabad: Police crack case of Durga idol vandalism, nab one.’ అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించారు.

వైరల్ వీడియోలోని స్క్రీన్‌గ్రాబ్/ఫోటోలకు సంబంధించినవి నివేదికలో చూడవచ్చు.

కథనం ప్రకారం.. బేగంబజార్ పోలీసులు నాగర్‌కర్నూల్‌కు చెందిన కృష్ణయ్యగౌడ్‌ను ఇందుకు సంబంధించి అరెస్టు చేశారు. విలేఖరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ మాట్లాడుతూ, కృష్ణయ్యగౌడ్‌ మానసికంగా అస్థిరంగా ఉన్నాడని, ఆహారం కోసం వేదిక వద్దకు వచ్చాడని చెప్పారు.

కీవర్డ్ సెర్చ్ లో ANI న్యూస్  అక్టోబర్ 12, 2024న ‘తెలంగాణ: దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు ఒకరిని అరెస్టు చేశారు, ఈవెంట్ నిర్వాహకులు కూడా బుక్ అయ్యారు’ అనే శీర్షికతో ఒక నివేదికను పంచుకుంది.

ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ఉందని, అందుకే వారిపై కూడా పోలీసులు కేసులు పెట్టారని నివేదిక పేర్కొంది. డీసీపీ యాదవ్ విగ్రహ భద్రతను పర్యవేక్షించడానికి వాలంటీర్ల పేర్లు ఇచ్చారని, అయితే నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవడంలో  విఫలమయ్యారన్నారు.

హైదరాబాద్‌లో దుర్గమ్మ విగ్రహాన్ని ముస్లింలు ధ్వంసం చేశారన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in