గత వారం రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ సాధారణ జీవనానికి అంతరాయం ఏర్పడి పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో, ఓ చిత్రం వరద నీటిలో మునిగిన అమరావతిని చూపిస్తు చిన్న పాటి వర్షానికి మునిగిపోయే చోట రాజధాని కడతాడు అంట అనే వాదనతో సోషల్ మీడియా వినియోగదారులు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
ఈ వైరల్ చిత్రాలు ఇటీవలది కావు అని సౌత్ చెక్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న చిత్రాలు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించినప్పుడు, 2019 ఆగస్టు 19న చీరాల చిన్నోడు ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ కనుగొన్నాము, ఆ పోస్టులో వరద వస్తే అమరావతి లో పరిస్థితి ఇలా ఉంటుంది....అంటూ వరద నీటిలో మునిగిన అమరావతిని చూపిస్తూ ఒక వైరల్ అవుతున్న చిత్రాన్ని మేము కనుగొన్నాము.
2019 ఆగస్టు 19న National Herald ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో అమరావతిలో కృష్ణా వరదల కారణంగా 87 గ్రామాలు దెబ్బతిన్నాయి, రెండు జిల్లాల్లో మొత్తం 4,352 ఇల్లు 5,311 హెక్టార్లలో పంటలు, 1,400 హెక్టార్లలో ఉద్యాన పంటలు వరదల్లో మునిగిపోయాయి అంటూ వైరల్ అవుతున్న చిత్రాలలో మరో చిత్రం ప్రచురించబడిన కథనాన్ని మేము కనుగొన్నాము
2021 నవంబర్ 21న India TV ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతం యొక్క దృశ్యం, వేలాది గ్రామస్తుల బాధగా మారిన ఆనకట్ట అంటూ వైరల్ అవుతున్న చిత్రాలలో మరో చిత్రం ప్రచురించబడిన కథనాన్ని మేము కనుగొన్నాము.
2022 అక్టోబర్ 06న తెలుగు గ్లోబల్ ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో అమరావతి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సమీప గ్రామాలు పూర్తిగా మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి అంటూ వైరల్ అవుతున్న ఒక చిత్రం ప్రచురించబడిన కథనాన్ని మేము కనుగొన్నాము.
అందువల్ల, ఈ వైరల్ అవుతున్న చిత్రాలు పాతవి మరియు 2019 నుండి చెలామణిలో ఉన్నాయి అని సౌత్ చెక్ కనుగొంది.